Telangana: రైతులకు శుభవార్త.. వరికి క్వింటాకు రూ.500 బోనస్
లంగాణ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఈ ఖరీఫ్ సిజన్ నుంచే సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం సమావేశం అయని కేబినెట్ సబ్ కమిటీ వరి పంటకు బోనస్, కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చింది. భేటీ అనంతరం ఉత్తమ్, పొంగులేటి వివరాలను వెల్లడించారు.
సన్న వడ్లకు వానాకాలం నుంచి క్వింటాకు రూ.500 ఇస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రైతులకు చాలా హామీలు ఇచ్చింది. ఇందులో ప్రధానమైన హామీ రైతు రుణ మాఫీ. రైతులకు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం రుణ మాఫీ చేసింది. కానీ అందరికి రుణ మాఫీ చేయలేదు. చాలా మంది అన్నదాతలు రుణ మాఫీ కాక ఆందోళన చెందునున్నారు. రుణ మాఫీ పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇక ఎన్నికల్లో వరి పంటకు రూ.500 బోనస్ అని ప్రకటించారు. అధికారంలోకి రాగానే సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని చెబుతున్నారని ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి. ఇక రైతు భరోసా ఇంకా రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. వానకాలం సీజన్ సగం పూర్తి అయింది కానీ.. ఇంకా రైతు భరోసా రాలేదు.. ఇది కూడా కొంత మందికి ఇచ్చి.. అందిరికి ఇచ్చామని ప్రభుత్వం చెప్పుకుంటుందని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 10 మంది ఉంటే.. ఇద్దరికి ఇచ్చి అందరికి ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటుందని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.
మొన్నటి వేసవి కాలంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయాయి. దీంతో ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల పరిహారం ప్రకటించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. కానీ రైతులు ఖాతాల్లో మాత్రం నిధులు జమ కాలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నమ్మం పోతుందని రైతు సంఘాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను మోసం కాలం వెళ్లదీస్తుందని.. కానీ రైతులు అమాయకులు కాదని గుర్తు చేస్తున్నాయి.