బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం నియంత పాలనలో తెలంగాణ పదేళ్లు మగ్గిపోయింది పొంగులేటి హయంలో పాలేరుకు అగ్రస్థానం ప్రజాపాలన దినోత్సవంలో దయాకర్ రెడ్డి ఖమ్మం / కూసుమంచి : తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం సెప్టెంబర్ 17 అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం, కూసుమంచి క్యాంపు కార్యాలయాల్లో మంగళవారం జరిగిన తెలంగాణ ప్రజాపాలన …

బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం

  • నియంత పాలనలో తెలంగాణ పదేళ్లు మగ్గిపోయింది
  • పొంగులేటి హయంలో పాలేరుకు అగ్రస్థానం
  • ప్రజాపాలన దినోత్సవంలో దయాకర్ రెడ్డి

ఖమ్మం / కూసుమంచి : తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం సెప్టెంబర్ 17 అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం, కూసుమంచి క్యాంపు కార్యాలయాల్లో మంగళవారం జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం దయాకర్ రెడ్డి మాట్లాడుతూ… స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజా ప్రభుత్వం భావించి సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేసిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నియంతపాలనలో తెలంగాణ పదేళ్ళు మగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు.

నియంతపాలనకు స్వస్తి చెబుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని వారి నమ్మకాన్ని వొమ్ము చేయకుండా ప్రజాపాలన కొనసాగిస్తుందని తెలిపారు. మంత్రి పొంగులేటి హయంలో పాలేరు నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కూసుమంచి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ భీమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకట్ రెడ్డి, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మద్దులపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వనవాసం నరేందర్ రెడ్డి, డైరెక్టర్ భద్రకాళి, గోనె భుజంగ రెడ్డి, కేతినేని వేణు, కూసుమంచి మాజీ ఎంపీపీ బాణోత్ శ్రీను,

తిరుమలాయపాలెం మాజీ ఎంపీపీ బోడా మంగీలాల్, జొన్నలగడ్డ రవి, హఫీజ్, ఉపేందర్, రామారావు, తమ్మినేని నవీన్, సురేష్ నాయక్, మియాభాయ్, ఇమామ్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కంచర్ల జీవన్ రెడ్డి, నర్సింహారావు, ఉమ్మినేని కృష్ణ, రాము, రవి, మొగిలిచర్ల సైదులు, చల్లా కృష్ణా రెడ్డి, నాగేశ్వరరావు,

శ్రీకళా రెడ్డి, స్వరూప, జ్యోతి, ఆటో ప్రసాద్, విప్లవ్ కుమార్, నాగరాజు, కౌశిక్, వంటికొమ్ము శ్రీనివాస రెడ్డి, రాంరెడ్డి, నెల్లూరి భద్రయ్య, మాజీ జెడ్పీటీసీ హనుమంతరావు, కొడాలి గోవిందరావు, శాఖమూరి రమేష్, మామిడి వెంకన్న, వెంపటి రవి, అంబటి సుబ్బారావు, తదితరులు ఉన్నారు.

Updated On 17 Sept 2024 3:04 PM IST
cknews1122

cknews1122

Next Story