స్వాతంత్ర్యం సాధించడానికి కృషి చేసిన మహనీయుల సేవలు చిరస్మరణీయం
తాసిల్దార్ మంగ
ప్రతి ఒక్కరూ అమ్మ పేరు మీద మొక్కను నాటాలి
ఇన్చార్జి ఎంపీడీవో బాణాల శ్రీనివాస్
ఘనంగా మండల కార్యాలయాలలో ప్రజా పాలన దినోత్సవం
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య సెప్టెంబర్ 17
స్వాతంత్ర్యం సాధించడానికి కృషి చేసిన మహనీయుల సేవలు చిరస్మరణీయం అని తాసిల్దార్ మంగ అన్నారు. మఠంపల్లి మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్,ఎంపీడీవో కార్యాలయాలలో తెలంగాణకు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17న పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మంగ మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 కు ఒక ప్రత్యేకత ఉందని ఎంతోమంది పోరాటాల త్యాగాల ఫలితంగా నిజాం నియంతృత్వ పాలన నుండి విముక్తి లభించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17న భారతదేశ యూనియన్ నందు విలీనమైన సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు
నేటితో 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఇన్చార్జ్ ఎంపీడీవో బాణాల శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి నుండి అక్టోబర్ రెండు వరకు జరిగే స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు ముఖ్యంగా యువత యువకులు పాల్గొని తమ వంతు గ్రామం పరిశుభ్రం గా ఉండే విధంగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు గ్రామ ప్రజలతో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు.
ప్రతి ఒక్కరూ విధిగా అమ్మ పేరు మీద ఒక మొక్కను నాటాలని దీనికి ప్రతి ఒక్కరు కంకణబద్ధులై ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ గిరి ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్ లు మరియు మండల పరిషత్, వివిధ శాఖల అధికారులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.