స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ భయంతో పరుగులు తీసిన విద్యార్థులు కామారెడ్డి పట్టణంలో బుధవారం ఉదయం ఓ స్కూల్‌ బస్సులో పెను ప్రమాదం సంభవించింది. బస్సులో బ్యాటరీ పేలడంతో భారీగా పొగలు వ్యాపించాయి. బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు.. వెంటనే అప్రమత్తమైన స్థానికులు విద్యార్థులను కిందకు దింపి.. మరమ్మతులు చేశారు. ఘటనా సమయంలో బస్సులో సుమారు 30 మంది స్టూడెంట్స్‌ ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కామారెడ్డిలోని …

స్కూల్ బస్సులో పేలిన బ్యాటరీ

భయంతో పరుగులు తీసిన విద్యార్థులు

కామారెడ్డి పట్టణంలో బుధవారం ఉదయం ఓ స్కూల్‌ బస్సులో పెను ప్రమాదం సంభవించింది.

బస్సులో బ్యాటరీ పేలడంతో భారీగా పొగలు వ్యాపించాయి. బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు..

వెంటనే అప్రమత్తమైన స్థానికులు విద్యార్థులను కిందకు దింపి.. మరమ్మతులు చేశారు. ఘటనా సమయంలో బస్సులో సుమారు 30 మంది స్టూడెంట్స్‌ ఉన్నట్లు సమాచారం.

స్థానికులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కామారెడ్డిలోని బ్రిల్లియంట్ గ్లామర్ స్కూల్ యాజమాన్యం ఇలాంటి ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.

Updated On 18 Sept 2024 2:14 PM IST
cknews1122

cknews1122

Next Story