
“మహారాష్ట్ర, ఒడిస్సాలో క్రైస్తవ వ్యతిరేక వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం
వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జాతీయ ఉపాధ్యక్షులు డా. పీటర్ నాయక్ లకావత్ తీవ్ర ఖండన”
సికె న్యూస్ ప్రతినిధి
మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే గోపిచంద్ పడల్కర్ క్రైస్తవ పాస్టర్లు మరియు వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని చేసిన హింసాత్మక, ద్వేషపూరిత రెచ్చగొట్టే వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
విషయానికోస్తే ఛత్తిష్ ఘర్డ్ లో ఇద్దరు క్రైస్తవ సిస్టర్స్ పై జరిగిన అక్రమ అరెస్టును మరువకముందే మరో రెండు రాష్ట్రాల్లో చెలరేగిన హింసాత్మక, ద్వేషపూరిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలపై వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జాతీయ ఉపాధ్యక్షులు డా. పీటర్ నాయక్ లకావత్ మాట్లాడుతూ, భారత్ లో మానవత్వాన్ని మరిచి మతపిచ్చిపట్టి మనిషికి మనిషికి మధ్యలో మతంపేరుతో లేనిపోని అపోహలు సృష్టించి శాంతి భద్రతలకు విఘతం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రజాస్వామ్యంలో రాజ్యంగానికి విరోదంగా, మానవ హక్కుల పరిరక్షణకు వ్యతిరేకంగా పనిచేసే వారిని వారు ఎంతటివారైనా చట్టం చూస్తూ ఊరుకోబోదని డా పీటర్ నాయక్ తీవ్రంగా ఖండించారు.
ఈ క్రమములో వారు మాట్లాడుతూ, అందరు మనుష్యులే… ఇక్కడ అన్ని మతాల వారికి ఎవరి మతంపై వారికి సంపూర్ణధికారం మరియు స్వేచ్ఛ ఉందని వారు పేర్కొన్నారు. ఎవరు ఏ రంగంలో ఉంటే ఆ వ్యవస్థకు నైతిక విలువలు తెచ్చేలా పనిచేస్తే ప్రజలు సంతోషిస్తారు.
అంతేకాదు ఈ దేశం యొక్క ఉన్నతిని కోరి ప్రపంచం మన దేశాన్ని కొనియాడేల మంచి పౌరులు అనిపించుకుంటారు. జూలై 8న పుణే క్రైస్తవ ఫోరమ్ ఆధ్వర్యంలో పుణే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన నిర్వహించబడింది.
ఈ సందర్భంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే పడల్కర్‌ను తక్షణమే అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేడు జూలై 11న ముంబై ఆజాద్ మైదాన్‌లో మరో పెద్ద శాంతియుత నిరసన చేపట్టనున్నారు అని వారు చెప్పారు.
క్రైస్తవ సంఘాల ప్రకటన ప్రకారం, జూన్ 17న సంగ్లీ (కుప్వాడ్)లో నిర్వహించిన టార్చ్ మార్చ్ సందర్భంగా పడల్కర్ గారు, పాస్టర్‌పై దాడి చేస్తే రూ. 3 లక్షలు, అవయవాలు విరగ్గొడితే రూ. 5 లక్షలు, పాస్టర్ మరియు కుటుంబాన్ని హత్య చేస్తే రూ. 11 లక్షల బహుమతి ప్రకటించినట్లు మా దృష్టికి వచ్చింది .
ఇది హింసకు ప్రేరేపించడమే కాకుండా సామాజిక సౌహార్ధానికి తీవ్రమైన ముప్పు అని నిరసనకారులు పేర్కొన్నారు. వారిని ఇబ్బంది పెట్టె హెయమైన చర్యలను మానుకోవాలి.
వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జాతీయ ఉపాధ్యక్షులు డా. పీటర్ నాయక్ లకావత్ మాట్లాడుతూ –“మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిశ్చేష్టులుగా చూడడం ఆందోళనకరం. ఇటువంటి నిర్లక్ష్యం ప్రపంచంలో ఏ దేశానికీ గాని, ప్రాంతానికీ గాని మంచిది కాదు.
కాబట్టి వెంటనే స్పందించి గోపిచంద్ ఎమ్మెల్యేపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలి” అని వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జాతీయ ఉపాధ్యక్షులు డా. పీటర్ నాయక్ డిమాండ్ చేశారు.