నర్సింగ్ విద్యార్థిని శృతి కేసులో వీడిన మిస్టరీ.. డ్రైవింగ్ స్కూల్లో ప్రేమ.. ఓయో హోటల్లో
వినాయక చవితి నిమజ్జనం వేళ హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో అనూమానాస్పద రీతిలో మృతి చెందిన నర్సింగ్ విద్యార్థిని శృతి కేసులో చిక్కుముడి వీడింది.ఆమెది హత్య కాదు ఆత్మహత్య అని నిర్ధారించారు.
రెండు రోజుల క్రితం రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో శృతి చనిపోయిన సంగతి విదితమే. అయితే ఈ కేసును చేధించారు పోలీసులు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని తేల్చారు. ప్రేమికుడు తనతో పెళ్లికి నిరాకరించడంతోనే ఆమె బలవనర్మణానికి పాల్పడిందని పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్లకు చెందిన శృతికి మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన జీవన్ పాల్‌తో డ్రైవింగ్ స్కూల్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. కాగా, గత కొంత కాలంగా తనను పెళ్లి చేసుకోవాలంటూ జీవన్ ను పోరు పెడుతోంది శృతి.
ఇటీవల భాగ్యనగరిలో జరిగిన గణేశ్ మహోత్సవాలకు రెండు రోజుల ముందు మరో జంటతో నగరానికి వచ్చారు శృతి అండ్ జీవన్. రెడ్ స్టోన్ ఓయో హోటల్లో రెండు రూములు అద్దెకు తీసుకున్నారు ఈ రెండు జంటలు. ఈ క్రమంలో మద్యం సేవించారు జీవన్ అతడి ఫ్రెండ్స్. ఇదే సమయంలో మరోసారి పెళ్లి గురించి అతడితో చర్చించింది శృతి.
జీవన్ పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో జీవన్.. పక్క రూంలో ఉన్న స్నేహితుడి దగ్గరకు వచ్చేశాడు. అనంతం మనస్థాపానికి గురైన నర్సింగ్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకోగా ఉరికి వేలాడుతూ కనిపించింది శృతి.
ఆమె గదిలో బీర్ బాటిల్స్‌తో పాటు గదిలో రక్తం మరకలు ఉన్నాయి. ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా.. శృతి రోడ్డు ప్రమాదానికి గురైందని జీవన్, అతడి ఫ్రెండ్స్ చెప్పారు. కానీ ఆమె ఆసుపత్రికి వెళ్లకుండా రూంలోనే ఉండిపోయింది.
ఇదిలా ఉంటే.. శృతి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికి కాదని, తమ కూతుర్ని జీవన్ అత్యాచారం చేసి హత్య చేసి సూసైడ్ గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు.
జీవన్ పాల్, అతని స్నేహితులు శృతిని హత్య చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇందులో హోటల్ సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
గది నిండా బీర్ బాటిల్స్ ఉన్నాయని, సిగరెట్స్, బ్లడ్స్ ఉన్నాయని, గదంతా చిందర వందరగా ఉందని.. ఇది సూసైడ్ కాదని, పక్కా మర్డర్ అంటూ వాదించారు. ఆమె మృతదేహాన్ని తరలించకుండా బంధువులు అడ్డుకున్నారు.
దీంతో పోలీసులు.. విచారణ చేపడతామని నచ్చ జెప్పి ఆమె మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. అది ఆత్మహత్యలేనని తేల్చారు.