ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు
సీకే న్యూస్ మాడుగులపల్లి సెప్టెంబర్ 20
నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కొత్తగూడెం వద్ద అద్దంకి- నార్కెట్ పల్లి రాష్ట్రీయ రహదారిపై అగ్ని ప్రమాదం చోటుబచేసుకుంది. రహదారిపై ప్రయాణిస్తున్న కార్ ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెరరేగాయి.
చూస్తుండగానే మంటలు కారు మొత్తం వ్యాపించాయి.మంటలు గమనించి కారులో ఉన్న ప్రయాణికుడుని స్థానికులు అద్దాలు పగల కొట్టి బయటికి తీశారు.
గాయాలతో ఆకస్మానిక స్థితిలో ఉన్న ప్రయాణికున్ని చికిత్స నిమిత్తం 108 వాహనంలో నల్గొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.