ఇసుకాసురుల ఇష్టారాజ్యం… రంగాపురంలో అక్రమంగా ఇసుక డంపులు…
బీఆర్ఎస్ నాయకుల ఇష్టారాజ్యం…
పెబ్బేరు సెప్టెంబర్20 (సి కే న్యూస్)
పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఇసుక మాఫియా పెట్రేగి పోతుంది. స్థానికంగా ఉన్న నది నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి డంపులు చేసుకొనిస్తానిక బీఆర్ఎస్ నాయకులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఠాగా ఏర్పడి కొంతమంది ఇసుక దందా చేసేవాళ్లు రంగాపురం శివారు ప్రాంతాల్లో ఏకంగా భారీ మొత్తంలో ఇసుక డంపులను ఏర్పాటు చేస్తున్నారు.
మండలంలోని రంగాపురం గ్రామంలోని ఇద్దరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా భారీ మొత్తంలో ఇసుకను డంపు చేశారు.చుట్టుపక్కల వాగుల నుంచి, కృష్ణానది నుంచి సేకరించిన ఇసుకను కొన్నిచోట్ల ఈ విధంగా డంపు చేసి అర్ధరాత్రులు వేరే ప్రాంతాలకు తరలించుకు పోతున్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదేదందా చేసిన రంగాపురం గ్రామానికి చెందిన ఇద్దరు సదరు వ్యక్తులు ఈ ఇసుక డంపును ఏర్పాటు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. మండలంలోని కృష్ణానది నుండి తీసుకువచ్చిన ఇసుకను భారీ మొత్తంలో డంప్ చేసి తర్వాత అర్ధరాత్రిలు జెసిబి సాయంతో ట్రాక్టర్లు టిప్పర్ల ద్వారా గద్వాలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఈ రవాణా కోసం మూడు ట్రాక్టర్లను రెండు టిప్పర్లను వినియోగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ అక్రమ దందా ను కట్టడి చేయడంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు శ్రద్ధ చూపాలని,ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అక్రమంగా ఇసుకను తరలించకపోతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.