భద్రాచలంలో 45 కేజీల ఎండు గంజాయి పట్టివేత. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, (సాయి కౌశిక్), సెప్టెంబర్ 20, ఖమ్మం డిసి జనార్దన్ రెడ్డి ఏసి గణేష్ ఆదేశాల మేరకు భద్రాచలం కూనవరం రోడ్డులోని ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ బృందం వాహన తనిఖీ చేస్తూ ఉండంగా ఒరిస్సా నుంచి రాజస్థాన్ కి కారులో ముఖేష్ మిర్ద, గుజ్జర్ శ్రీరామ అను వ్యక్తులు 45.170 కేజి ల ఎండు గంజాయిని …

భద్రాచలంలో 45 కేజీల ఎండు గంజాయి పట్టివేత.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, (సాయి కౌశిక్),

సెప్టెంబర్ 20,

ఖమ్మం డిసి జనార్దన్ రెడ్డి ఏసి గణేష్ ఆదేశాల మేరకు భద్రాచలం కూనవరం రోడ్డులోని ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ బృందం వాహన తనిఖీ చేస్తూ ఉండంగా ఒరిస్సా నుంచి రాజస్థాన్ కి కారులో ముఖేష్ మిర్ద, గుజ్జర్ శ్రీరామ అను వ్యక్తులు 45.170 కేజి ల ఎండు గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు.

రెండు సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సి.హెచ్ శ్రీనివాస్ మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ బాలు, కానిస్టేబుల్స్ సుధీర్, హరీష్, హనుమంతరావు, వెంకట్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Updated On 20 Sept 2024 5:03 PM IST
cknews1122

cknews1122

Next Story