కామారెడ్డి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య? కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. దోమకొండ మండలం అంబర్‌పేట్ గ్రామానికి చెందిన వీణ(23), కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి(24) కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ గురించి చెప్పి.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావించారు. కానీ, వీరి ప్రేమను …

కామారెడ్డి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య?

కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. దోమకొండ మండలం అంబర్‌పేట్ గ్రామానికి చెందిన వీణ(23), కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి(24) కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు.

వీరి ప్రేమ గురించి చెప్పి.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావించారు. కానీ, వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో, మనస్థాపానికి గురయ్యారు.

ఈ క్రమంలో​నే శుక్రవారం సాయంత్రం కోనాపూర్‌లో చెట్టుకు ఉరివేసుకుని సాయికుమార్‌, అంబర్‌పేట్‌లోని తన ఇంట్లో దూలానికి ఉరేసుకుని వీణా ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో, ఇరు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

ఆత్మహత్యల సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం మృతదేహాలను స్థానిక కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్ని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Updated On 21 Sept 2024 1:42 PM IST
cknews1122

cknews1122

Next Story