జలపాతంలో ముగ్గురు వైద్య విద్యార్థుల గల్లంతు అల్లూరి జిల్లా మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి మండలం జలతరంగణి వాటర్ ఫాల్స్ వద్ద ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఒక్కసారిగా వర్షం పడి వాగు ఉధృతంగా రావడంతో విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.ఇద్దరు అమ్మాయిల ఆచూకీ లభ్యం కాగా.. వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒక అమ్మాయిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి …

జలపాతంలో ముగ్గురు వైద్య విద్యార్థుల గల్లంతు

అల్లూరి జిల్లా మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి మండలం జలతరంగణి వాటర్ ఫాల్స్ వద్ద ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.

ఒక్కసారిగా వర్షం పడి వాగు ఉధృతంగా రావడంతో విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.
ఇద్దరు అమ్మాయిల ఆచూకీ లభ్యం కాగా.. వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఒక అమ్మాయిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి జీజీహెచ్‌కు తరలించారు. ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి ఆచూకీ తెలియాల్సి ఉంది.

విద్యార్థుల ఆచూకీ కోసం మారేడుమిల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విహారయాత్రకు మొత్తం 13 మంది విద్యార్థులు వెళ్లగా.. వారిలో 10 మంది అమ్మాయిలు, 3 గురు అబ్బాయిలు వచ్చారు. వీరంతా ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు అని తెలిసింది.

Updated On 23 Sept 2024 6:54 AM IST
cknews1122

cknews1122

Next Story