HyderabadPoliticalTelangana

తెలంగాణ జిల్లాలో దంచి కొడుతున్న వాన

తెలంగాణ జిల్లాలో దంచి కొడుతున్న వాన

తెలంగాణ జిల్లాలో దంచి కొడుతున్న వాన

హైదరాబాద్ నగరంలో మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి. ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, అంబర్‌పేట్, రామంత పూర్, తార్నాక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

మాదాపూర్ ఏరియాలో వర్షం కారణంగా ట్రాఫిక్‌కు జామ్ అయ్యింది. ఇటు ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.రాష్ట్రంలోని భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్‌లోని పెద్దపల్లి, మహబూబాబాద్ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది.

నిజామాబాద్‌, సిరిసిల్ల, యాదాద్రి, వికారాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 26వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

హైదరాబాద్ వాతావరణం శాఖ వెల్లడించిన ప్రకారం.. ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్‌పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

గురువారం.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button