పెళ్లి పేరుతో మోసం చేశాడని హర్ష సాయిపై యువతి ఫిర్యాదు..!
హర్ష సాయి అనే పేరు తెలుగు రాష్ట్రలో యువత అందరికి తెలిసిందే. యూ ట్యూబ్ ధ్వారా సెలబ్రెటీ అయిన హర్ష సాయి పేదలకు సహాయం చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు.ఇక ప్రస్తుతం సినిమా తీస్తున్న విషయం తెలిసిందే.
కానీ ఈ మధ్య సినిమా న్యూస్ కంటే హర్ష సాయి గురించి వేరే న్యూస్ ల ద్వారానే వార్తగాలో నిలుస్తున్నాడు. కొంత కాలం కింద హర్ష సాయి మొత్తం ఫేక్ అంటూ వార్తలు నడిచిన విషయం తెలిసిందే. వాటి పైన తన వంతు వివరణ ఇచ్చుకున్నాడు.
అయితే ఇప్పుడు యూట్యూబర్ హర్ష సాయి పై నార్సింగ్ పీఎస్ లో కేసు నమోదయ్యింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని హర్ష సాయి పై యువతి ఫిర్యాదు చేసింది.
అడ్వకేట్ తో కలిసి పీఎస్ కి వచ్చి మరి ఫిర్యాదు చేసింది యువతి. సోషల్ మీడియా లో సెలబ్రిటీ హోదాలో ఉన్న హర్ష సాయికి యూ ట్యూబ్ లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే.. హర్ష సాయికి సోషల్ మీడియాలో హ్యాండిల్ యూట్యూబ్‌లో దాదాపు 14 మిలయన్ ఫాలవోర్స్ ను సంపాదించుకున్నాడు. అయితే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గా బాగా ఫేమస్ అయిన హర్ష సాయిపై గత కొన్ని రోజులు క్రితం బెట్టింట యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో మొన్నటి వరకు హర్ష సాయి పేరు నెట్టింట తెగ మారు మోగిపోయిన విషయం తెలిసిందే..
అయితే తాజాగా మరోసారి హర్ష సాయి ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ సోషల్ మీడియా పై ఓ యువతి తాజాగా చీటింగ్ కేసు నమోదు చేసింది. పెళ్లి పేరుతో రూ. 2 కోట్ల వరకు వసూల్ చేశాడని ఆమె నిన్న మంగళవారం రాత్రి నార్సింగ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా.. తనపై హత్యాచారానకి పాల్పడ్డారని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఇక హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ పై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా హర్ష సాయి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్గింగ్ పోలీసులు అతనిపై 376(2), 376ఎన్, 354 పలు సెక్షన్ల కింద అతని పై అత్యాచార కేసు నమోదు చేశారు. అంతేాకాకుండా.. మంగళవారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు బాధిత యువతికి కొండాపూర్ లోని రంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్య పరీక్షల చేయించేందుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో కొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధిత యువతిపై హర్ష సాయి పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. తనపై లైంగిక దాడి జరుపుతూనే.. తన నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడని, వాటిని చూపిస్తూ బెదరిస్తున్నాడని తన కంప్లైంట్ లో పేర్కొంది.
ఇక నగ్న ఫోటోలు, వీడియోలు చూపించి పలుమార్లు లైంగిక దాడి చేశాడని తెలిపింది. ప్రస్తుతం హర్ష సాయిపై బాధిత యువతి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అలాగే పోలీసులు కూడా యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హర్షసాయికి పలుమార్లు ఫోన్ చేశారు. కానీ, అతని ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా.. హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు హర్ష సాయి కోసం గాలిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. మరి, హర్షసాయి కేసులో వెలుగులోకి వచ్చిన ఈ సంచలన నిజాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.