అధిక పని ఒత్తిడితో ఇబ్బందులకు గురవుతున్నాం:-గ్రామ పంచాయతీ కార్యదర్శులు
సీకే న్యూస్ వేములపల్లి సెప్టెంబర్ 25
అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారాలు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు బదలాయించడంతో అధిక పని ఒత్తిడితో సతమతం అవుతున్నామని దానితో సామూహిక సెలవులు రాష్ట్రవ్యాప్తంగా ప్రకటించడం జరిగిందని గ్రామపంచాయతీ కార్యదర్శులు తెలిపారు.బుధవారం వేములపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని కార్యదర్శులు అందరు మండల అభివృద్ధి అధికారి శారదా దేవికి మెమొరండం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతు సర్పంచుల పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సమస్యలు మరియు ప్రభుత్వ కార్యక్రమాలు పంచాయతీ కార్యదర్శులకు బదలాయించడంతో అనేక ఇబ్బందులకు గురైవుతున్నామని వెంటనే పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని మండలాధికారికి మెమోరండం ఇవ్వడం జరిగిందని అన్నారు
ఈ కార్యక్రమంలో వేములపల్లి మండల పరిధిలోని గ్రామాలకు సంబందించిన పంచాయతీ కార్యదర్శులు అందరూ పాల్గొనడం జరిగింది