మఠంపల్లి లో ఘనంగా పోషణ మాసోత్సవాలు
పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి
జిల్లా శిశు సంక్షేమ శాఖ డిడబ్ల్యుఓ నరసింహారావు
మొట్టమొదట విద్యాబుద్ధులు నేర్పే పాఠశాల అంగన్వాడీ కేంద్రం
ఇన్చార్జి ఎంఈఓ వెంకటాచారి
పిల్లలు బరువు తగ్గినట్లయితే ఆరోగ్య పరీక్షలు చేయించాలి
డాక్టర్ సుధాకర్ నాయక్
వివిధ రకాల వంటలతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించిన అంగన్వాడీ టీచర్లు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య సెప్టెంబర్ 25
మఠంపల్లి మండల కేంద్రంలో బుధవారం సెక్టార్ పరిధిలో పౌస్టి కాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమంతాలు, అన్నాప్రాసన. అక్షరా- భాషసారాలు అంగన్వాడి టీచర్లు ఆయాలు అబ్బురపరిచే విధంగా వివిధ రకాల వంటలతో ఫుడ్ పెస్టివల్ నిర్వహించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా జిల్లా శిశు సంక్షేమ శాఖ డి డబ్ల్యు ఓ నరసింహారావు మఠంపల్లి ఇన్చార్జి ఎంఈఓ వెంకటాచారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సుధాకర్ నాయక్ విచ్చేసి కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని మొట్టమొదట పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే పాఠశాల అంగన్వాడి కేంద్రం అని పిల్లల బరువు ప్రతినెల తప్పనిసరిగా చూపించుకోవాలని బరువు తక్కువగా ఉన్న పిల్లలను అవసరమైతే ఆరోగ్య కేంద్రానికి పంపించి ఆరోగ్య పరీక్షలు చేయించాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొండేటి రాంరెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆశా కార్యకర్తలు ప్రభుత్వం నుండి తక్కువ వేతనాలు తీసుకుంటున్న పనిలో మాత్రం నిబద్ధతతో అంకుటిత దీక్షతో ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి గ్రామ కుటుంబ సర్వేలు అడిగిన ఆగమేఘాలమీద వెను వెంటనే వారికి ఎన్ని పనులు ఉన్నా ప్రజలతో మమేకమైతు ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నారని వారి సేవలు అమోఘం అని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో పీహెచ్ఓ కళావతి హెల్త్ సూపర్వైజర్ నాగేంద్రమ్మ ఐసిడిఎస్ సూపర్వైజర్లు వసంత లక్ష్మి నిర్మల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఇట్టి కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు బాలింతలు వివిధ గ్రామాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.