త్వరలో 612 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖలు అనుమతి ఇచ్చాయి.వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. తెలంగాణలోని వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు భారీగా ఖాళీ ఉన్న నేపథ్యంలో.. మరో 1600 మెడికల్‌ ఆఫీస ర్‌(స్పెషలిస్ట్‌) పోస్టులను మంజూరు …

త్వరలో 612 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖలు అనుమతి ఇచ్చాయి.వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు భర్తీ ప్రక్రియను చేపట్టనుంది.

తెలంగాణలోని వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు భారీగా ఖాళీ ఉన్న నేపథ్యంలో.. మరో 1600 మెడికల్‌ ఆఫీస ర్‌(స్పెషలిస్ట్‌) పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ.. వైద్య, ఆరోగ్యశాఖ ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపింది.

తెలంగాణ వైద్యారోగ్య శాఖ నుంచి ఇటీవలే ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 633 ఫార్మాసిస్టు గ్రేడ్‌ 2 పోస్టులను భర్తీకి ప్రకటన ఇచ్చారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి అక్టోబర్ 05వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 23, 24 తేదీల్లో ఆన్ లైన్ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు నవంబర్ 30వ తేదీన జరుగుతాయి. https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌ పద్దతిలో పనిజేసే వారికి వెయిటేజ్‌ ఇస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫార్మసీ పూర్తి చేయటంతో పాటు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో నమోదు చేసుకొని ఉండాలి. అభ్యర్ధులు ఈ ఏడాది జూలై 1 నాటికి 46 ఏళ్లకు మించి ఉండకూడదు.

ముఖ్య తేదీలు :

ఆన్ లైన్ దరఖాస్తులు - 05 అక్టోబర్ , 2024.

దరఖాస్తులకు తుది గడువు - 21, అక్టోబర్ , 2024.

దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ - అక్టోబర్ 23, 24

రాత పరీక్షలు - 11 నవంబర్ , 2024.

Updated On 26 Sept 2024 1:56 PM IST
cknews1122

cknews1122

Next Story