చికిత్స పొందుతూ వైద్య విద్యార్థి మృతి.. ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన హైదరాబాద్‌: చికిత్స పొందుతూ వైద్య విద్యార్థి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో చోటు చేసుకుంది. ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్న వరుణ్‌తేజ్‌ (23) కడుపులో మంటగా ఉందని కేపీహెచ్‌బీ రోడ్‌ నెం.1లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైద్యులు.. అపెండిసైటిస్‌గా గుర్తించారు. గురువారం ఉదయం శస్త్ర చికిత్స చేస్తుండగానే వరుణ్‌తేజ్‌ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని ఆరోపిస్తూ అతని …

చికిత్స పొందుతూ వైద్య విద్యార్థి మృతి.. ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన

హైదరాబాద్‌: చికిత్స పొందుతూ వైద్య విద్యార్థి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో చోటు చేసుకుంది. ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్న వరుణ్‌తేజ్‌ (23) కడుపులో మంటగా ఉందని కేపీహెచ్‌బీ రోడ్‌ నెం.1లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు.

పరీక్షించిన వైద్యులు.. అపెండిసైటిస్‌గా గుర్తించారు. గురువారం ఉదయం శస్త్ర చికిత్స చేస్తుండగానే వరుణ్‌తేజ్‌ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని ఆరోపిస్తూ అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రికి వద్దకు చేరుకుని పరిస్థితి అదుపు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు.

Updated On 27 Sept 2024 10:42 AM IST
cknews1122

cknews1122

Next Story