తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు? హైదరాబాద్:సెప్టెంబర్ 27డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. ఆయన విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో దొంగలు ఆయన ఇంటికి కన్నం వేశారు. చోరీ చేసిన దొంగలను పశ్చిమ్‌బెంగాల్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పశ్చిమ్‌బెంగాల్‌ లోని ఖరగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో ఏడో నంబర్‌ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని వెంటనే పోలీసులు …

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు?

హైదరాబాద్:సెప్టెంబర్ 27
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. ఆయన విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో దొంగలు ఆయన ఇంటికి కన్నం వేశారు.

చోరీ చేసిన దొంగలను పశ్చిమ్‌బెంగాల్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పశ్చిమ్‌బెంగాల్‌ లోని ఖరగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో ఏడో నంబర్‌ ప్లాట్‌ఫాంపై జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు.

వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. తాము దొంగలమని ఒప్పుకు న్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో దొంగతనం చేసినట్లు తెలిపారు.

నిందితులు బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్‌, ఉదయ్‌కుమార్‌ ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. వారి వద్ద బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నామని ఖరగ్ పూర్ జిఆర్పిఎస్పి దేబశ్రీ సన్యాల్ తెలిపారు.

ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు..

Updated On 27 Sept 2024 5:04 PM IST
cknews1122

cknews1122

Next Story