దేవర సినిమా ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు హైదరాబాద్: సెప్టెంబర్ 27ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇవాళ రాత్రి 1:00గంట నుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లలో ఉదయం నాలుగు గంటల నుంచే షోలు ప్రారంభమయ్యా యి. ఇదిలా ఉండగా సినిమా …

దేవర సినిమా ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు

హైదరాబాద్: సెప్టెంబర్ 27
ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఇవాళ రాత్రి 1:00గంట నుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లలో ఉదయం నాలుగు గంటల నుంచే షోలు ప్రారంభమయ్యా యి.

ఇదిలా ఉండగా సినిమా విడుదల సందర్బంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ దగ్గర అపశృతి చోటు చేసుకుంది.

థియేటర్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు అంటుకుంది. ఎన్టీఆర్ కటౌట్ తగలబడుతున్న ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి.

సినిమా నచ్చని కొంతమంది ఆకతాయిలు ఎన్టీఆర్ కటౌట్ ను తగలబెట్టారంటూ ప్రచారం కూడా జరుగుతుంది అయితే.. కటౌట్ ను ఫ్యాన్స్ తగలబెట్టలేదని, టపాసులు కాల్చుతుండగా ప్రమాదవశాత్తు కటౌట్ కు నిప్పు అంటుకుందని తెలుస్తోంది.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు…

Updated On 27 Sept 2024 1:59 PM IST
cknews1122

cknews1122

Next Story