సూసైడ్‌ నోట్‌ రాసి యువకుడి ఆత్మహత్య... మరణ వార్త తట్టుకోలేక ప్రియురాలి ఆత్మహత్యాయత్నం... సికింద్రాబాద్‌లోని లాడ్జిలో బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న జయశంకర్‌ భూపాలపల్లికి చెందిన అక్షయ్‌కుమార్‌ (24) వద్ద పోలీసులు సూసైడ్‌ నోట్‌ గుర్తించారు. తాను ప్రేమికుడిని కాదని, జీవితంలో ఓడిపోయానని, అమ్మకి కొడుకుగా పనికిరానని పేర్కొన్నాడు. అప్పులు చేశానని, మోసం చేయాలనుకోవడం లేదని నోట్‌లో రాశాడు. పోలీసుల సమాచారంతో కుమారుడి మరణవార్తను తెలుసుకుని గురువారం కుటుంబసభ్యులు మార్కెట్‌ ఠాణాకు చేరుకున్నారు. అప్పులపాలై.. ఉద్యోగంపోయి.. అప్పులపాలు …

సూసైడ్‌ నోట్‌ రాసి యువకుడి ఆత్మహత్య...

మరణ వార్త తట్టుకోలేక ప్రియురాలి ఆత్మహత్యాయత్నం...

సికింద్రాబాద్‌లోని లాడ్జిలో బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న జయశంకర్‌ భూపాలపల్లికి చెందిన అక్షయ్‌కుమార్‌ (24) వద్ద పోలీసులు సూసైడ్‌ నోట్‌ గుర్తించారు.

తాను ప్రేమికుడిని కాదని, జీవితంలో ఓడిపోయానని, అమ్మకి కొడుకుగా పనికిరానని పేర్కొన్నాడు. అప్పులు చేశానని, మోసం చేయాలనుకోవడం లేదని నోట్‌లో రాశాడు. పోలీసుల సమాచారంతో కుమారుడి మరణవార్తను తెలుసుకుని గురువారం కుటుంబసభ్యులు మార్కెట్‌ ఠాణాకు చేరుకున్నారు.

అప్పులపాలై.. ఉద్యోగంపోయి.. అప్పులపాలు కావడం, ఉద్యోగం పోవడంతోనే అక్షయ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. ఏడాదిగా నగరంలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల బైక్‌ కొనుగోలు చేసినపుడు రెండ్రోజులు సెలవు పెట్టాడు. దీంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు.

ఈ నెల 22న ఇంటికి వెళ్లి నగరానికి వెళ్లనని, ఇక్కడే ఉంటానని తండ్రికి చెప్పాడు. అదే రోజు నగరానికి వచ్చి సెల్‌ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు. 24న రాత్రి సెల్‌ఫోన్‌ ఆన్‌చేసి స్టేటస్‌లో స్నేహితుల, బంధువుల ఫొటోలతో పాటు ఇదే చివరి రోజని మెసేజ్‌ పెట్టాడు. లొకేషన్‌ ఆధారంగా స్నేహితుడు గుర్తించాడు. లాడ్జికి వెళ్లి చూసేసరికే ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆసుపత్రిలో ప్రియురాలు: నగరానికి చెందిన ఓ యువతి (23) అక్షయ్‌కుమార్‌ ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులకు చెప్పడంతో పెళ్లికి అంగీకరించారు. బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి లాడ్జికి వచ్చింది. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకున్న ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్నేహితులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated On 27 Sept 2024 11:55 AM IST
cknews1122

cknews1122

Next Story