తుపాకితో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య..! రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌ బాలకృష్ణగౌడ్‌ (28) ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఏ ఆర్ కానిస్టేబుల్ తన తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ S/o సత్తయ్య, వయస్సు: 28 సంవత్సరాలు. Occ- AR కానిస్టేబుల్ నం. 8596, RCK రాచకొండ …

తుపాకితో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య..!

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌ బాలకృష్ణగౌడ్‌ (28) ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఏ ఆర్ కానిస్టేబుల్ తన తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.

మంచాల గ్రామానికి చెందిన దూసరి బాలకృష్ణ S/o సత్తయ్య, వయస్సు: 28 సంవత్సరాలు. Occ- AR కానిస్టేబుల్ నం. 8596, RCK రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏ ఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు.

అయితే గత కొంతకాలంగా ఆన్లైన్లో బెట్టింగ్‌లకు బానిసైన కానిస్టేబుల్.. ఆర్థికంగా ఒత్తిడికి గురై విధులు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు ముగించుకొని వాష్ రూమ్‌కి వెళ్లి తాళం వేసి తన సర్వీస్ గన్‌తో కాల్చుకొని అక్కడికక్కడే మృతి చెందారు.

దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపడుతున్నారు.

Updated On 28 Sept 2024 10:28 AM IST
cknews1122

cknews1122

Next Story