మంత్రి పొంగులేటి ఇళ్ల పై ఈడీ దాడులు భాజపా కక్షసాధింపులో భాగమే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూత్ కమిటీ సభ్యుడు సాయితేజ సి కే న్యూస్ ఇల్లందు నియోజకవర్గ ప్రతినిధిసెప్టెంబర్ 28 మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ఇళ్ల పై ఈడీ దాడులు అన్యాయమని, అప్రజాస్వామికమని అమెరికాలోని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూత్ కమిటీ సభ్యుడు సాయితేజ తీవ్రంగా ఖండించారు. సరైన కారణాలు లేకుండా మంచి వ్యక్తులను బీజేపీ టార్గెట్ చేస్తోందని, ఇది ప్రజాస్వామ్య సమాజంలో ఆమోదయోగ్యం కాదని …

మంత్రి పొంగులేటి ఇళ్ల పై ఈడీ దాడులు భాజపా కక్షసాధింపులో భాగమే

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూత్ కమిటీ సభ్యుడు సాయితేజ

సి కే న్యూస్ ఇల్లందు నియోజకవర్గ ప్రతినిధి
సెప్టెంబర్ 28

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ఇళ్ల పై ఈడీ దాడులు అన్యాయమని, అప్రజాస్వామికమని అమెరికాలోని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యూత్ కమిటీ సభ్యుడు సాయితేజ తీవ్రంగా ఖండించారు.

సరైన కారణాలు లేకుండా మంచి వ్యక్తులను బీజేపీ టార్గెట్ చేస్తోందని, ఇది ప్రజాస్వామ్య సమాజంలో ఆమోదయోగ్యం కాదని సాయితేజ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వంలో రెవెన్యూ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ గారిపై రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంపై సాయితేజ మండిపడ్డారు .

రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, భయపెట్టడానికి భారతీయ జనత పార్టీ పార్టీ అధికారాన్ని ఉపయోగించుకుంటోందని సాయితేజ ఆరోపించారు

Updated On 28 Sept 2024 6:52 PM IST
cknews1122

cknews1122

Next Story