నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన డీఆర్డీవో.. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ) 200 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ మేరకు కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్: 40
- టెక్నీషియన్ అప్రెంటీస్: 40
- ట్రేడ్ అప్రెంటీస్: 120
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, కెమికల్, కమర్షియల్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2024 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
అప్రెంటీస్షిప్ కాలం: ఒక సంవత్సరం
ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 15
వెబ్సైట్: https:www.drdo.gov.in/drdo/