హోంగార్డును హైడ్రా బలి తీసుకుందనడం సరికాదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల సంగారెడ్డి జిల్లాలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఆ సమయంలో ఓ హోంగార్డు తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ. ఆదివారం సాయంత్రం మృతి చెందాడు.. అయితే హోంగార్డును హైడ్రా బలి తీసుకుందని సోషల్ మీడియాలు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. కూల్చివేతలన్నీంటికి హైడ్రాకు ముడి పెట్టవదన్నారు. సంగారెడ్డి, మల్కాపూర్ చెరువుతో హైడ్రాకు ఎలాంటి …

హోంగార్డును హైడ్రా బలి తీసుకుందనడం సరికాదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

ఇటీవల సంగారెడ్డి జిల్లాలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఆ సమయంలో ఓ హోంగార్డు తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ. ఆదివారం సాయంత్రం మృతి చెందాడు..

అయితే హోంగార్డును హైడ్రా బలి తీసుకుందని సోషల్ మీడియాలు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. కూల్చివేతలన్నీంటికి హైడ్రాకు ముడి పెట్టవదన్నారు.

సంగారెడ్డి, మల్కాపూర్ చెరువుతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. సంగారెడ్డిలో హోం గార్డు గాయపడి మరణిస్తే హైడ్రా బలి తీసుకుందని చెప్పడం సరికాదన్నారు ఏవీ రంగనాథ్.

Updated On 30 Sept 2024 10:34 AM IST
cknews1122

cknews1122

Next Story