NotificationPoliticalTelangana

సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు జరపలేం : తేల్చేసిన సీఎం రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు జరపలేం : తేల్చేసిన సీఎం రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు జరపలేం : తేల్చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హై కోర్టు కు వివరణ ఇవ్వనున్న ప్రభుత్వం..

స్థానికసంస్ధల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని తేలిపోయింది. ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో అందరిలోను ఇవేఅనుమానాలను పెరిగిపోతున్నాయి. బ్యాలెట్ బాక్సులు, ఓటర్ జాబితాలను సిద్ధం చేసింది. ఈనెల 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు సైతం ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రపతి, గవర్నర్లు తమ ముందుకు వచ్చిన బిల్లులపై 90 రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుపై రాష్ట్రపతి స్పష్టత కోరారు.

ఈ నేపథ్యంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వచ్చే వరకు స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో వేచి చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విలేకరులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.

దీంతో పాటు రాష్ట్రంలో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగిస్తూ పంపిన మరో బిల్లు కూడా రాష్ట్రపతి వద్ద ఉందని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ క్రమంలో ఈ నెల 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలపై ఏం చేయాలన్న విషయంపై న్యాయనిపుణులతో సంప్రదించి తగిన విధంగా స్పందిస్తామని వెల్లడించారు. అవసరమైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను హైకోర్టుకు వివరించి మరింత గడువు కోరతామని చెప్పారు.

తాజాగా రేవంత్ రెడ్డి ప్రకటనతో.. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు ప్రయత్నిస్తుండగా.. దీనిపై చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఈ అంశంపై స్పష్టత వచ్చేవరకు స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం లేదని రేవంత్ రెడ్డి మాటలను బట్టి అర్థమవుతోంది. అంటే ఈనెల 30 లోగా సర్పంచ్ ఎన్నికలు జరగకపోగా.. మరికొంత సమయం పట్టే ఛాన్సుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button