కుటుంబ సభ్యుల వివరాల సేకరణ,డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి…
జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జెండగే
సి కే న్యూస్ (సంపత్) అక్టోబర్ 03
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుటుంబ సభ్యుల వివరాల సేకరణ, డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జెండగే సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం రోజున బీబీనగర్ మండలంలోని మహాదేవ్ పూర్ గ్రామములో జరుగుతున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఫ్యామిలీ డేటా బెస్ ఆధారంగా అధికారులు నిర్వహిస్తున్న సర్వే తీరును కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి, నమోదు కానీ పేర్లు నమోదు చేయాలని సూచించారు.ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా అన్ని వివరాలను సక్రమంగా సేకరించాలని అన్నారు.నిర్ణీత సమయం లోపు పైలెట్ సర్వే ను పూర్తి చేయాలని,ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఏ ఒక్క కుటుంబం కూడా తప్పిపోకుండా డిజిటల్ సర్వే నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి అమరేందర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, మండల తహసిల్దార్ శ్రీధర్,రెవిన్యూ ఇన్స్పెక్టర్, పంచాయతీ సెక్రెటరీ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.