ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య అక్టోబర్ 02
మఠంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీజీ 155వ జయంతి వేడుకల సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.
ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో బాణాల శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీ కలలు కన్న స్వరాజ్యం సహకారం అయ్యేలా యువత గాంధీజీ మార్గంలో నడవాలి అని కొనియాడారు.
అనంతరం మఠంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఈజీఎస్ సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.