లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా పవిత్రోత్సవములు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య అక్టోబర్ 02
మట్టపల్లి మహక్షేత్రములో శ్రీ రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ, భక్త ప్రహ్లాద సహిత యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారికి త్రయాహ్నికదీక్షగా వైఖానస శాస్త్రానుసారంగా పవిత్రోత్సవములు తేది:30-09-2024 నుండి 03-10-2024 వరకు అత్యంత వైభవముగా నిర్వహించబడునున్నవి.
బుధవారం ఉదయం 7-00లకు దేవోత్థాపన, ఆరాధన అష్టోత్తరశతకలశస్నపన సుముహూర్తే పవిత్రారోపణము, ప్రధాన హెూమం, బలిహరణం, మూలమంత్రహెూమము, సర్వబేరాణం పవిత్రారోపణం, నీరాజన మంత్రపుష్పములు జరిగినవి.
సాయంత్రం 7-00 గం లకు శ్రీ స్వామి వారికి ఉత్సవము, మహాశాంతి హెూమము జరిగినవి. ఇట్టి కార్యక్రమములు యాజ్ఞిక నిర్వాహణ ఆగమప్రవర బొర్రా వాసుదేవాచార్యులు, ముత్తారం గ్రామం ఖమ్మం వారు మరియు దేవాలయ అర్చకులుచే అత్యంత వైభవంగా నిర్వహించబడుచున్నవి.
ఇట్టి కార్యక్రమంలో దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్ కుమార్ కార్యనిర్వహణాధికారి సిరికొండ నవీన్, తూమాటి శ్రీనివాసాచార్యులు, బ్రహ్మాచార్యులు,ఫణిభూషణ మంగాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయాణాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, అంజనేయాచార్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.