కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య అక్టోబర్ 02 మఠంపల్లి మండల కేంద్రంలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రులు మరియు విజయదశమి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభం అయ్యాయని పండగ నిర్వాహకులు తెలిపారు ఆలయాన్ని ప్రధాన రహదారులను విద్యుత్ కాంతులతో ఎంతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 03 నుండి 12వ తేదీ వరకు పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ …

కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య అక్టోబర్ 02

మఠంపల్లి మండల కేంద్రంలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రులు మరియు విజయదశమి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభం అయ్యాయని పండగ నిర్వాహకులు తెలిపారు ఆలయాన్ని ప్రధాన రహదారులను విద్యుత్ కాంతులతో ఎంతో సుందరంగా అలంకరించారు.

ఈ సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 03 నుండి 12వ తేదీ వరకు పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ సోమయాజుల లక్ష్మీ నరసింహమూర్తి వారి ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నవని ఉదయం 10 గంటలకు నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కుంకుమ పూజ నిర్వహించడం జరుగుతుందని అమ్మవారికి నిత్య ఆరాధన పూజలు జరుగుతాయని ఆలయ అర్చకులు తెలియజేశారు.

అదేవిధంగా మండల కేంద్రంలో మహిళలు ఘనంగా చక్కని పూలతో అలంకరించిన బతుకమ్మలను ఎత్తుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షణ చేసి పూజా కార్యక్రమం అనంతరం ఆటపాటలతో బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు.

Updated On 3 Oct 2024 10:06 AM IST
cknews1122

cknews1122

Next Story