స్టార్ హోట‌ల్‌లో ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. సికింద్రాబాద్‌లోని తాజ్ 3 స్టార్ హోట‌ల్‌లో ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఆ ముగ్గురు అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్ల‌డాన్ని హోట‌ల్ సిబ్బంది మంగళవారం ఉద‌యం గుర్తించింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది.. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. హుటాహుటిన ఆ ముగ్గురిని ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారు సికింద్రాబాద్ య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌హంకాళి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వీరి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి గ‌ల కార‌ణాలు …

స్టార్ హోట‌ల్‌లో ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..

సికింద్రాబాద్‌లోని తాజ్ 3 స్టార్ హోట‌ల్‌లో ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఆ ముగ్గురు అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్ల‌డాన్ని హోట‌ల్ సిబ్బంది మంగళవారం ఉద‌యం గుర్తించింది.

దీంతో అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది.. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. హుటాహుటిన ఆ ముగ్గురిని ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారు సికింద్రాబాద్ య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై మ‌హంకాళి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వీరి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. హోట‌ల్ గ‌దిలో క్లూస్ టీమ్ ఆధారాల‌ను సేక‌రించింది.

శంషాబాద్ మధుర నగర్‌కు చెందిన తోట బవన్న త‌న భార్య ప‌ద్మావ‌తి, కుమారుడు సుజ‌న్‌తో క‌లిసి తాజ్ త్రీస్టార్ హోట‌ల్‌లో సోమవారం రాత్రి దిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. కూల్ డ్రింక్‌లో విషం క‌లిపి సేవించిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.

Updated On 8 Oct 2024 5:44 PM IST
cknews1122

cknews1122

Next Story