'లే కన్నయ్యా… ఇంటికి వెళ్లిపోదాం!' ఆసుపత్రి బెడ్‌పై కుమారుడి పక్కన పడుకుని బాబు నిద్రపోతున్నాడంటూ ఆ తల్లి జోకొడుతోంది…కాసేపట్లో అందరం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళిపోతామనీ చెబుతోంది. కానీ ఆ చిన్నారిని రోడ్డు ప్రమాదం కబళించిందని.. ఇక మళ్లీ తనని అమ్మా అని పిలవలేడని ఎవరు చెప్పినా ఆ తల్లి మనసుకు పట్టడం లేదు. ఓ వైపు కన్నీరు కారుస్తూనే మరోవైపు భ్రమతో కుమారుడి మృతదేహం పక్కనే కూర్చుని అతడితో సంభాషిస్తూ ఉండిపోయింది. అందరినీ కంటతడి పెట్టించిన …

'లే కన్నయ్యా… ఇంటికి వెళ్లిపోదాం!'

ఆసుపత్రి బెడ్‌పై కుమారుడి పక్కన పడుకుని బాబు నిద్రపోతున్నాడంటూ ఆ తల్లి జోకొడుతోంది…
కాసేపట్లో అందరం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళిపోతామనీ చెబుతోంది.

కానీ ఆ చిన్నారిని రోడ్డు ప్రమాదం కబళించిందని.. ఇక మళ్లీ తనని అమ్మా అని పిలవలేడని ఎవరు చెప్పినా ఆ తల్లి మనసుకు పట్టడం లేదు. ఓ వైపు కన్నీరు కారుస్తూనే మరోవైపు భ్రమతో కుమారుడి మృతదేహం పక్కనే కూర్చుని అతడితో సంభాషిస్తూ ఉండిపోయింది.

అందరినీ కంటతడి పెట్టించిన ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడుకు చెందిన బాబూరామ్, శిరీష దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

వారికి ఇద్దరు కుమారులు కాగా చిన్నోడు (3) ఇటీవల అనారోగ్యానికి గురవడంతో పిల్లలిద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై సోమవారం రాజంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్‌ అదుపు తప్పి అంతా కింద పడిపోయారు.

ముందు భాగంలో కూర్చున్న పెద్ద కుమారుడు శ్యామ్‌(5) ఎగిరి రోడ్డుపై పడటంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సిబ్బంది శ్యామ్‌ మృతదేహాన్ని ఆసుపత్రిలో బెడ్‌పై ఉంచగా తల్లి శిరీష ఆ పక్కనే పడుకుని.. కన్నయ్యా ఎంత సేపు పడుకుంటావు నిద్రలే అని పిలుస్తూ భ్రమలోనే ఉండిపోయారు. బాలుడి తండ్రి ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించినా పిల్లాడు నిద్రలేచాకే ఇంటికి వెళదామని చెప్పడంతో ఆయనా విలపిస్తూ ఉండిపోయారు.

Updated On 8 Oct 2024 7:07 AM IST
cknews1122

cknews1122

Next Story