లంచం తీసుకున్న భార్యను పట్టించిన భర్త.. ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బే! ప్రభుత్వ అధికారులు లంచం పుచ్చుకున్న వ్యవహారాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. లంచాలు పుచ్చుకుని భారీ స్థాయిలో ఆస్తులు చేర్చుకునే అధికారులను అరెస్ట్ చేసే దాఖలాలు కూడా ఎన్నో బయటపడ్డాయి. ఇలాంటి కేసుల్లో బయట ఇచ్చే సమాచారం మేరకు అధికారులను అరెస్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. వివరాల్లోకి వెళితే.. మనికొండ మున్సిపల్ డీఈఈగా పని చేస్తున్న దివ్యజ్యోతిని భర్త శ్రీపాద్ మీడియాకు పట్టించారు. …
![లంచం తీసుకున్న భార్యను పట్టించిన భర్త.. లంచం తీసుకున్న భార్యను పట్టించిన భర్త..](https://cknewstv.in/wp-content/uploads/2024/10/IMG-20241009-WA0025.jpg)
లంచం తీసుకున్న భార్యను పట్టించిన భర్త.. ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బే!
ప్రభుత్వ అధికారులు లంచం పుచ్చుకున్న వ్యవహారాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. లంచాలు పుచ్చుకుని భారీ స్థాయిలో ఆస్తులు చేర్చుకునే అధికారులను అరెస్ట్ చేసే దాఖలాలు కూడా ఎన్నో బయటపడ్డాయి.
ఇలాంటి కేసుల్లో బయట ఇచ్చే సమాచారం మేరకు అధికారులను అరెస్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. వివరాల్లోకి వెళితే.. మనికొండ మున్సిపల్ డీఈఈగా పని చేస్తున్న దివ్యజ్యోతిని భర్త శ్రీపాద్ మీడియాకు పట్టించారు.
లంచం తీసుకుంటున్న భార్యను పట్టించిన భర్త శ్రీపాద్
— Telugu Scribe (@TeluguScribe) October 9, 2024
మనికొండ మున్సిపల్ డీఈఈగా పని చేస్తున్న దివ్యజ్యోతిని మీడియాకు పట్టించిన భర్త శ్రీపాద్.
ప్రతి రోజు తన భార్య దివ్యజ్యోతి అక్రమంగా లక్షలలో లంచం తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతుందని, తప్పంటే నన్ను తిట్టేదని వీడియోలు తీసి… pic.twitter.com/dz6v5sXsCe
ప్రతి రోజు తన భార్య దివ్యజ్యోతి అక్రమంగా లక్షలలో లంచం తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతుందని, తప్పంటే తనను తిట్టేదని వీడియోలు తీసి మీడియాకు పంపారు.
భార్య దివ్యజ్యోతి వేదన భరించలేక విడాకులు ఇచ్చేశాడు. తాజాగా భార్య లంచం తీసుకున్న సందర్భంగా తీసిన వీడియోలను పోలీసులకు పంపించి.. భార్యను పట్టించాడు..శ్రీపాద్. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)