రైతుబంధు నిధులు నొక్కేసిన తహశీల్దార్ అరెస్టు
TG: అక్రమంగా రైతుబంధు నిధులను పొందిన నల్గొండ జిల్లా అనుముల తహశీల్దార్ జయశ్రీని పోలీసులు అరెస్టు చేశారు. 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసుపుస్తకాలు పొంది రూ.14.63 లక్షల రైతుబంధు సొమ్మును స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ధరణి ఆపరేటర్ జగదీశ్ బంధువుల పేరిట 2019లో జయశ్రీ పాస్ బుక్ జారీ చేశారు. జయశ్రీ, జగదీశ్, పట్టాదారులు రైతుబంధు నిధులను సగం సగం పంచుకున్నారు.
తాసిల్దార్ వజ్రాల జయశ్రీని అరెస్టు చేసి కోర్టుకు తరలించిన పోలీసులు
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మరియు బూరుగడ్డ గ్రామాలలో నవంబర్ 2019 నుండి ఫిబ్రవరి 2020 వరకు 36 ఎకరాల 23 గుంటల ప్రభుత్వ భూమిని ధరణి ఆపరేటర్ కుటుంబ సభ్యులు, ఇతరుల పేరున ఐ ఎల్ ఎం అర్ ఎస్ పోర్టల్ లోకి మార్పిడి చేసిన విషయంలో హుజూర్ నగర్ పోలీసులు విచారణ జరిపి నాటి హుజూర్ నగర్ తహసీల్దార్ వజ్రాల జయశ్రీని బుధవారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.