ఒకటే పోస్ట్, మొదటి ప్రయత్నంలోనే జాబ్... డీ ఎస్సిలో జిల్లా మొదటి ర్యాంక్ సాధించి మహిళ సత్తా చాటింది. మండలంలోని తెర్లుమద్ది గ్రామానికి చెందిన చామంతి ఇటీవల వెలువడిన డీ ఎస్సి ఫలితాల్లో తన సత్తా చాటింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీ.ఈ) విభాగంలో 56.5 మార్కులు సాధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైంది. జిల్లాలో ఉన్న ఒకటే పోస్టుకు 134 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా ,ఉన్న ఒకే ఒక్క పోస్టును చామంతి …

ఒకటే పోస్ట్, మొదటి ప్రయత్నంలోనే జాబ్...

డీ ఎస్సిలో జిల్లా మొదటి ర్యాంక్ సాధించి మహిళ సత్తా చాటింది. మండలంలోని తెర్లుమద్ది గ్రామానికి చెందిన చామంతి ఇటీవల వెలువడిన డీ ఎస్సి ఫలితాల్లో తన సత్తా చాటింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీ.ఈ) విభాగంలో 56.5 మార్కులు సాధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైంది.

జిల్లాలో ఉన్న ఒకటే పోస్టుకు 134 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా ,ఉన్న ఒకే ఒక్క పోస్టును చామంతి సాధించి మొదటి ప్రయత్నంలోనే జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించడం పట్ల చామంతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తెర్లుమద్ది గ్రామానికి చెందిన చింతల మహేష్ తో 2021 సంవత్సరంలో చామంతి వివాహం జరిగింది.

భర్త ప్రోత్సాహంతో అప్పటి నుండే పట్టు వదలకుండా ఇంట్లోనే ఆన్లైన్ క్లాస్ లు వింటూ ఓ వైపు పాపని చూసుకుంటూ మరో వైపు చదువుకుంటూ మొదటి ప్రయత్నంలోనే జాబ్ సాధించడం చాలా ఆనందంగా ఉందని చామంతి తెలిపింది. బుధవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్డర్ కాపీ అందుకోనుంది.

Updated On 9 Oct 2024 11:55 AM IST
cknews1122

cknews1122

Next Story