బతుకమ్మ వేడుకల్లో ఆడపడుచులతో ఆడిపాడిన మంత్రి పొంగులేటి..
బతుకమ్మ వేడుకల్లో ఆడపడుచులతో ఆడిపాడిన మంత్రి పొంగులేటి.. సద్దుల బతుకమ్మ వేడుకల్లో కోలాటంతో సందడి .. తెలంగాణ సంస్కృతి కి అద్దం పడుతూ మహిళలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలు వారిలో నూతనోత్సాహాన్ని నింపడమే కాకుండా అంతా ఓచోట చేరి ఉత్సవాలు నిర్వహించుకోవడం ద్వారా స్నేహ సౌగంధాలు వెల్లివిరుస్తాయని మంత్రి పొంగులేటి . గురువారం కూసుమంచి మండలం పెరిక సింగారం, జక్కేపల్లి గ్రామంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి పొంగులేటి పాల్గొని …
![బతుకమ్మ వేడుకల్లో ఆడపడుచులతో ఆడిపాడిన మంత్రి పొంగులేటి.. బతుకమ్మ వేడుకల్లో ఆడపడుచులతో ఆడిపాడిన మంత్రి పొంగులేటి..](https://cknewstv.in/wp-content/uploads/2024/10/IMG-20241010-WA0158.jpg)
బతుకమ్మ వేడుకల్లో ఆడపడుచులతో ఆడిపాడిన మంత్రి పొంగులేటి..
సద్దుల బతుకమ్మ వేడుకల్లో కోలాటంతో సందడి ..
తెలంగాణ సంస్కృతి కి అద్దం పడుతూ మహిళలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలు వారిలో నూతనోత్సాహాన్ని నింపడమే కాకుండా అంతా ఓచోట చేరి ఉత్సవాలు నిర్వహించుకోవడం ద్వారా స్నేహ సౌగంధాలు వెల్లివిరుస్తాయని మంత్రి పొంగులేటి .
గురువారం కూసుమంచి మండలం పెరిక సింగారం, జక్కేపల్లి గ్రామంలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి పొంగులేటి పాల్గొని కోలాటం వేసి మహిళల్లో ఉత్సాహం నింపారు.
మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపి మహిళలంతా స్వశక్తితో మహారాణులు గా వెలుగొందాలని పొంగులేటి ఆకాంక్షించారు.
తెలంగాణ సాంసృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేలా బతుకమ్మ వేడుకలు జరుపుతున్న అక్కా చెల్లెళ్ళను అభినందించారు. కార్యక్రమంలో పరిసర గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)