సీఎం ఇంట్లో విషాదం.. బావమరిది మురసోలి సెల్వం మృతి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సీఎం స్టాలిన్ బావ మురసోలి సెల్వం కన్నుమూశారు. గురువారం బెంగళూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సీఎం స్టాలిన్, ఆయన తనయుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ బెంగళూరు వెళ్లారు. మురసోలి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్.. బావ భౌతికకాయంపై పడి ఎక్కి ఎక్కి ఏడ్చారు. 85 ఏళ్ల మురసోలి సెల్వం గతంలో తమిళ …

సీఎం ఇంట్లో విషాదం.. బావమరిది మురసోలి సెల్వం మృతి

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సీఎం స్టాలిన్ బావ మురసోలి సెల్వం కన్నుమూశారు. గురువారం బెంగళూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

సీఎం స్టాలిన్, ఆయన తనయుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ బెంగళూరు వెళ్లారు. మురసోలి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్.. బావ భౌతికకాయంపై పడి ఎక్కి ఎక్కి ఏడ్చారు.

85 ఏళ్ల మురసోలి సెల్వం గతంలో తమిళ దినపత్రిక మురసోలికి ఎడిటర్‌గా పని చేశారు. మురసోలి పత్రిక డీఎంకే పార్టీ అధికారిక గొంతుకగా పేరుపొందింది. మురసోలి.. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి మేనల్లుడు.

సెల్వం… కరుణానిధి కుమార్తెనే వివాహం చేసుకున్నారు. అంతేకాదు సెల్వం… కేంద్ర మాజీ మంత్రి మురసోలి మారన్‌కు తమ్ముడు. సెల్వం భౌతికకాయానికి నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ భార్య సంగీత సోర్నలింగం కూడా నివాళులర్పించారు.

Updated On 11 Oct 2024 3:44 PM IST
cknews1122

cknews1122

Next Story