బతుకమ్మ పండుగ వేళ తీవ్ర విషాదం... ఇదొక పరువు హత్య బావమరిది కళ్లల్లో నీళ్లు తుడిచేందుకు.. చెల్లెమ్మ ప్రియుడిని చింపేసిన అన్న గోదావరిఖనిలో సంచలనం పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఓ యువతి తలవంచింది. మెడలో తాళికట్టించుకుంది. భర్తతో కాపురం చేసింది. ఇద్దరు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. కానీ తన మనసులో భర్తకు చోటు ఇవ్వలేదు. ఓ యువకుడిని ప్రేమించింది. పోలీసుల సమక్షంలో తనను ప్రేమించిన వ్యక్తే కావాలని పట్టుబట్టింది. వేరే పెళ్లి చేసుకుంది. హాయిగా కాపురం చేస్తోంది. …

బతుకమ్మ పండుగ వేళ తీవ్ర విషాదం...

ఇదొక పరువు హత్య

బావమరిది కళ్లల్లో నీళ్లు తుడిచేందుకు..

చెల్లెమ్మ ప్రియుడిని చింపేసిన అన్న

గోదావరిఖనిలో సంచలనం

పెద్దలు కుదిర్చిన పెళ్లికి ఓ యువతి తలవంచింది. మెడలో తాళికట్టించుకుంది. భర్తతో కాపురం చేసింది. ఇద్దరు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. కానీ తన మనసులో భర్తకు చోటు ఇవ్వలేదు.

ఓ యువకుడిని ప్రేమించింది. పోలీసుల సమక్షంలో తనను ప్రేమించిన వ్యక్తే కావాలని పట్టుబట్టింది. వేరే పెళ్లి చేసుకుంది. హాయిగా కాపురం చేస్తోంది. కానీ బంధువులు సహించలేకపోయారు. తమ పరువు పోయిందని నలిగిపోయారు. కడకు తన చెల్లి కాపురంలో చిచ్చుపెట్టాడనే ఆక్రోశంతో.. ఆమెను పెళ్లాడిన యువకుడిని చంపేశాడు.

చేతికి వచ్చిన కొడుకును పోగొట్టుకున్నామని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతుంటే.. రెండో పెళ్లి చేసుకున్న ఇల్లాలు ఆ శవం ముందు వెక్కివెక్కి ఏడుస్తోంది. బతుకమ్మ పండుగ వేళ తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యైటింక్లయిన్‌ కాలనీ హనుమాన్‌ నగర్‌లో చోటు చేసుకుంది.

టూటౌన్‌ సీఐ ప్రసాద్‌రావు, యువకుడి కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్‌- 3 డిస్పెన్సరీలో స్కావెంజర్‌గా పని చేస్తున్న వడ్డాది కుమార్‌ టీ2 క్వార్టర్‌లో నివసిస్తున్నాడు. అతని కుమారుడు వినయ్‌ (27) గోదావరిఖని సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో కాంట్రాక్టు స్కావెంజర్‌గా పని చేస్తున్నాడు. బాపూజీ నగర్‌కు చెందిన పెళ్లయిన యువతి అంజలీతో ప్రేమలో పడ్డాడు.

ఈ విషయంలో ఆమె భర్త కుటుంబ సభ్యులు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల సమక్షంలోనే ప్రేమించిన యువకుడితో ఉంటానని ఆమె కరాకండీగా చెప్పింది. ఆపై ప్రియుడిని పెళ్లి చేసుకుంది.

మూడు నెలలుగా యైటింక్లయిన్‌ కాలనీలోని హనుమాన్‌ నగర్‌లో ఓ అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. సద్దుల బతుకమ్మ పూట అంజలీకి తన అన్న ఫోన్‌ చేశాడు. కాలనీకి వచ్చానని, ఒకసారి చూసి వెళ్తానని చెప్పాడు. అంతే తన ఇంటి అడ్రస్‌ను అంజలి చెప్పింది.

పథకం ప్రకారం.. మాజీ భర్తతో కలిసి వచ్చిన అన్న ఇంట్లో మాట్లాడుతూనే తన వెంట తెచ్చుకున్న కత్తితో వినయ్‌ కుమార్‌పై దాడి చేసి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. ఎదిగి వచ్చిన ఒక్కగానొక్క కుమారుడు కళ్లెదుటే హత్యకు గురై ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Updated On 11 Oct 2024 11:54 AM IST
cknews1122

cknews1122

Next Story