ఖమ్మంలో సందడి చేసిన “రాధే కృష్ణ” చిత్ర యూనిట్
మా చిత్రాన్ని ఆదరించండి.
విలేకరుల సమావేశంలో మూవీ నిర్మాత వూడుగు సుధాకర్.
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం
ఖమ్మం నగరంలోని జడ్పి సెంటర్ లో ఉన్న ఆదిత్య థియేటర్ లో శుక్రవారం ఎస్.వి క్రీయేషన్స్ బ్యానర్ పై చిత్రీకరించిన “రాధే కృష్ణ”(1980) సినిమా రిలీజ్ అయిన సందర్భంగా,చిత్ర యూనిట్ థియేటర్ లో సందడి చేసింది. మార్నింగ్ షో తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో థియేటర్ వద్ద బాణసంచా కాల్చి,కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా థియేటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం ముత్యాలగూడెం గ్రామానికి చెందిన మూవీ ప్రొడ్యూసర్ వూడుగు సుధాకర్ ,డైరెక్టర్ ఇస్మాయిల్,హీరో ఎస్.ఎస్. సైదులు,హీరోయిన్ లు
భ్రమరాంబిక తూటిక,అర్పిత లోహిత తో కలిసి మాట్లాడారు. ప్రేక్షకులు మా చిన్న సినిమాను అధరించాలని కోరారు.
సినిమా షూటింగ్ పల్లెటూరి వాతావరణం లో చిత్రీకరించమని,న్యాచురల్ మూవీగా తెరకెక్కించినట్లు చెప్పారు.కుటుంబ సమేతంగా వచ్చి సినిమాను చూసేలా మూవీని చిత్రీకరించినట్లు నిర్మాత తెలిపారు.
ఇంకొన్ని థియేటర్ల లో సినిమాను రిలీజ్ చేస్తే బాగుండేదని ఆశాభావం వ్యక్తం చేశారు.తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకులను మెప్పించే విధంగా,ప్రేమ,ఎమోషన్,కుటుంబ కథగా ఆధారం చేసుకుని చక్కటి సినిమాను ప్రేక్షకులకు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా,డిఓపి ఇలియాజ్ పాషా,గోపి,స్టోరీ రైటర్ మాచర్ల రాజేష్,ఫైట్ మాస్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.