పరీక్షలకు అర్హత.. ఉద్యోగాలకు అనర్హత
జీవోలు మార్చినంత ఈజీగా సర్టిఫికెట్లు మార్చగలమా
డీఎస్సీలో హిందీ పండిట్లకు ఘోరమైన మోసాలు
విధ్వాన్ తో ఒకప్పుడు ఉద్యోగాలు ఇప్పుడు నిరుద్యోగాలు
అక్టోబర్ 21 (సీ కే న్యూస్) చేగుంట
తెలంగాణ రాష్ట్రంలో హిందీ విద్వాన్ పండితులకు డీఎస్సీ 2024లో రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని డీఎస్సీ 2024 హిందీ అభ్యర్థి బాలసాయి హరి ప్రసాద్ తనకు జరిగిన అన్యాయాన్ని నేడు విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు,
ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ 2024 సంవత్సరంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలలో హిందీ పండిట్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం,విద్యాశాఖ అన్యాయం చేసినన్నారు ,
డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రారంభంలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న హిందీ,విద్వాన్ అర్హత కలిగిన అభ్యర్థులకు హాల్ టికెట్ ఇచ్చి,పరీక్షలకు అనుమతి కల్పించి,ర్యాంక్ కార్డు విడుదల చేసే వరకు అర్హతలు కల్పించి,ఉద్యోగ అపాయింట్మెంట్ ఇచ్చే సమయంలో విద్యాశాఖ ఉన్నత అధికారులు హిందీ పండిట్ లను అనర్హులుగా గుర్తించారు,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు .దక్షిణ భారతి హిందీ ప్రచార సభ మద్రాసు సర్టిఫికెట్ కలిగి ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడానికి ప్రయత్నాలు చేస్తుందన్నారు. కానీ మద్రాస్ లో చదువుకున్న సర్టిఫికెట్ కి అర్హత కల్పించిన ప్రభుత్వం,తెలంగాణలో ఉన్న హిందీ ప్రచార సభ హైదరాబాద్ వారి సర్టిఫికెట్ ను రాష్ట్రంలో అనుమతించాలని వారు కోరారు,
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్వాన్ అర్హత కలిగిన వారికి అప్పటి ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించిందన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే విద్వాన్ సర్టిఫికెట్ కలిగిన వారిని పరిగణలోకి తీసుకోకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్వాన్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు,
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విధ్వాన్ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని,కోరారు,రాష్ట్ర ప్రభుత్వం హిందీ విద్వాన్ ను అనర్హతగా ప్రకటన చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో కొంతమంది హిందీ పండితులు పిటిషన్ వెషామని తెలిపారు.