అధికార పార్టీ నీడలో ఉన్న వాళ్లకే నా" నిలువు నీడ.? లేక.! "గృహలక్ష్మి ఇంటింటి సర్వేకి అధికార పార్టీ సైన్యమే రాబోతుందా.?" "గత ప్రభుత్వం చేసిన తప్పే ప్రస్తుత ప్రభుత్వం చేయనుందా.?" "అసలు గృహలక్ష్మి పథకానికి అర్హత ఏమిటి.?" "అసలు ఎస్సీ - ఎస్టీ కి గృహలక్ష్మి రిజర్వేషన్లు ఉన్నాయా.?" "కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ లెంటల్ ఇంటి బిల్లులు కూడా అందుకొని వారి పరిస్థితి ఏంటి.?" "గృహలక్ష్మి పథకం పేరుతో పలు రకాల మండల పార్టీ నాయకులు …

అధికార పార్టీ నీడలో ఉన్న వాళ్లకే నా" నిలువు నీడ.? లేక.!

"గృహలక్ష్మి ఇంటింటి సర్వేకి అధికార పార్టీ సైన్యమే రాబోతుందా.?"

"గత ప్రభుత్వం చేసిన తప్పే ప్రస్తుత ప్రభుత్వం చేయనుందా.?"

"అసలు గృహలక్ష్మి పథకానికి అర్హత ఏమిటి.?"

"అసలు ఎస్సీ - ఎస్టీ కి గృహలక్ష్మి రిజర్వేషన్లు ఉన్నాయా.?"

"కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ లెంటల్ ఇంటి బిల్లులు కూడా అందుకొని వారి పరిస్థితి ఏంటి.?"

"గృహలక్ష్మి పథకం పేరుతో పలు రకాల మండల పార్టీ నాయకులు పన్నుతున్న పద్మవ్యూహం ఏంటి.?"

"ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్"

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గృహలక్ష్మి పథకం పై ఇప్పటికే పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అసలు గృహలక్ష్మి పథకానికి అర్హత ఏమిటి.? పార్టీ జెండా మోయడమే మా ఎజెండాగా అనుకున్న వారికి మాత్రమే" గృహలక్ష్మి అదృష్టం వరిస్తుంది అని పలు పార్టీలు వెల్లడి చేస్తున్న విమర్శలు ఎంతవరకు నిజాలు.?

ఒకవేళ అదే జరిగితే గిరిజన సంఘాల పరిస్థితి ఏంటి.? గత ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి తప్పిదాలను వెతికి కెసిఆర్ రెండు పడకల ఇళ్లపై పలు రకాల ఆరోపణల జల్లు కురిపించినటువంటి, ప్రస్తుత అధికార పార్టీ, గృహలక్ష్మి ఇళ్లపై ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది..

అప్పటి కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇంటి పథకానికి అర్హులైన వారు అసలు ఎంతవరకు ఇందిరమ్మ ఇళ్లపై పూర్తి స్థాయిలో లబ్ధి పొందారు.. ఇందిరమ్మ ఇంటి బిల్లులను పూర్తిస్థాయిలో అందుకొని బాధితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్వష్టత కల్పించనుంది, అసలు నూతనంగా ఏర్పడినటువంటి రేషన్ కార్డులకు గృహలక్ష్మి పథకం వరించనుందా…

గత ప్రభుత్వం ఏర్పరచినటువంటి పలు రకాల పథకాల పేర్లతో మండల నాయకులు జోబులు నింపుకున్న విషయం గూర్చి. పాత్రికేయులు పలుమార్లు కథనాలు రాయగా, ముట్టి ముట్టనట్టు అంటి అంటనట్టు ఇచ్చి ఇవ్వనట్టు బాధితులకు మండల నాయకులు తీసుకున్న సొమ్ములు తిరిగిచ్చారన్న విషయం జగమెరిగిన సత్యమే" మరి ఇప్పుడు గృహలక్ష్మి పథకం పేరుతో మరల పైసా వసూల్ చేయనున్నారా…? అనే విషయం మాత్రం మండలాల్లో చేర్చనఅంశంగా మారింది..

అసలే ఇచ్చిన 6 గ్యారంటీల విషయంలో సతమతం అవుతున్న ప్రస్తుత పార్టీ గత పాలకులు చేసినటువంటి తప్పిదాలను మరల కొనసాగిస్తే మాత్రం కచ్చితంగా "కథ కంచికి" "పార్టీ ఇంటికి చేరాల్సిందే" అన్నట్టుగా ప్రజా ఊహగానాలు…

Updated On 21 Oct 2024 7:05 AM IST
cknews1122

cknews1122

Next Story