CinemaPoliticalTelangana

ఆర్జీవీ పై మరో కేసు.. స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రిటైర్డ్ మహిళా ఐపీఎస్

ఆర్జీవీ పై మరో కేసు.. స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రిటైర్డ్ మహిళా ఐపీఎస్

ఆర్జీవీ పై మరో కేసు.. స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రిటైర్డ్ మహిళా ఐపీఎస్

Web desc : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఎప్పుడూ సంచలనాలకు కేంద్రంగా నిలుస్తారు. తన సినిమాలతో పాటు వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలిచే ఆయనపై మరోసారి కేసు నమోదైంది. తరచుగా ఏదో రకంగా వార్తలలో ఉండే డైరెక్టర్ గత కొన్ని రోజులుగా తన మూవీస్ షూటింగ్ లలో బిజీ అయిపోయారు.

అయితే.. ఒక్కసారిగా ఆయన మరోసారి తాను తీసిన వెబ్ సిరిస్ వివాదం కారణంగా వార్తలలో నిలిచారు. ఈ నేపథ్యంలో.. కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

దహనం అనే వెబ్ సిరీస్ వ్యవహారంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా ఫిర్యాదుతో కేసు నమోదయింది. ఈ వెబ్ సిరిస్ లో తన పేరును ప్రస్తావించడంపై అంజనా సిన్హా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే.. అంజన అంజన సిన్హా చెప్పిన విధంగా ఈ వెబ్ సిరిస్ లో.. కొన్ని సీన్లు తీశామంటూ రాంగోపాల్ వర్మ ప్రస్తావించడం ప్రస్తుతం కాంట్రవర్సీగా మారింది.

తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా తన పేరు వాడినందుకు అంజన సిన్హా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తలలో నిలిచారు. దీనిపై ఆర్జీవీ ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button