స్పెషల్ ఆఫీసర్ ల పాలనలో పేరుకుపోతున్న చెత్త..
దృష్టి సారించేది ఎవరు?
పేరుకు పోతున్న చెత్త కదలని మురుగు
1,సమస్యల వలయం లో బోడియాతండా
2,పూడిక తీయరు, దోమల మందు కొట్టారు
3,పూడిక తీసి బ్లీచింగ్ చల్లరు.
కూసుమంచి మండలం బోడియాతండా: గ్రామ పంచాయతీ లో సైడ్ కాలువల్లో చెత్త, రాళ్లు, ప్లాస్టిక్ కవర్లు విపరీతమైన చెత్త చెదారం తో నిండి పోయి తీవ్ర వాసన వెదజల్లుతుంది,
గ్రామ పంచాయతీ సిబ్బంది శుభ్రం చేయడం లేదు రోజు రోజుకి చెత్త పెరగడతో సైడ్ డ్రైనేజీ ఫుల్ అవుతుంది, చిన్న పిల్లలు అటుగా వెళ్తే కాలువ లో పడే ప్రమాదం కూడా ఉంది,అంతే కాకుండా ఆ కాలువలు 30,సంవత్సరాలకాలoలో కట్టించినవి కాబట్టి వాటిని శుభ్రం చేయడం గ్రామ పంచాయతీ సిబ్బంది కి శుభ్రం చేయడం కష్టంగ మారింది,
అదే విదంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడినప్పుడు కొత్త గ్రామ పంచాయతీ లు ఏర్పాటాయి గ్రామానికో శాస్మన వాటిక డంపింగ్ యార్డ్ చెత్త చెదారం కోసం ఏర్పాటు చేశారు కొంతకాలంగా రహదారి ఉండేది,
ఈ మధ్యనే ఒక రైతు తన వ్యవసాయ క్షేత్రనికి పోవడానికి దారి లేదు అనీ ఆ రైతు శస్మాన వాటికకు కూడా పోకూడదు అనీ jcb ద్వారా గుంటలు తోవాడు పోవడానికి దారి లేదు, ఇంట్లో ఉన్న చెత్త అంతా గ్రామాలలో బాజార్ల మీద కు కవర్ లు గాలికి పంట పొలాల కు కొట్టుకు పోతున్నవి చెత్త తీసుకుపోవడానికి ట్రాక్టర్ కూడా రావడం లేదు,
సైడ్ డ్రైనేజీ కొత్తవి శాంక్షన్ అయినా నిర్మాణo చేయడం లేదు, సీసీ రోడ్స్ శాంక్షన్ అయినా వేయటం లేదు,గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ అయినా నిర్మించడం లేదు అద్దె భవనం లో పంచాయతీ కొనసాగుతుంది,గ్రామ పంచాయతీ స్థలం దూరంగా ఉండటం తో ప్రజలకు అందుబాటులో ఉండాలని స్థలము కోసం దాతలు ముందుకు రావాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు.
అదే విదంగా మంచి నీళ్లు త్రాగటానికి ఒకటే బోరింగ్ తండా మొత్తం ఉదయాన్నే లేచి పనులు మానుకొని బింద్యలు, ప్లాస్టిక్ క్యాన్ తో తీసుకు పోతారు మంత్రి గారి సహాయర్ధం ఒక బోరు వేయించగలరని కోరుకుంటూన్నాము, మిషన్ భగీరథ నీళ్లు వాడుకోటానికి వస్తున్నాయి
ఈ విషయం పై గ్రామ సెక్రటరీ ద్రుష్టి పెట్టి పై అధికారులకు చెప్పి సమస్య ను త్వరగా తిరిపోయేలాగా చూడాలి ,మరియు పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయినా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపి మా గ్రామాన్ని అభివృద్ధి పథo వైపు నడిపిస్తారు అనీ కోరుకుంటూన్నాము.