దేవాలయాల్లో వరుస దొంగతనాలు... పోలీసు అధికారులు నిఘా పెంచాలి. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్), అక్టోబర్ 22, మణుగూరు పట్టణంలో దొంగలు రెచ్చిపోతూ దేవాలయాలే వాళ్ళ లక్ష్యంగా చేసుకొని హుండీలను పగలగొట్టి వాటిలోని డబ్బులను విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. మణుగూరు మండల పరిధిలోని సమితి సింగారం గ్రామ పంచాయతీ సమీపంలోని ముత్యాలమ్మ దేవాలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. అమ్మవారి దేవాలయంలో దేవత వెండి కండ్లు, వెండి …

దేవాలయాల్లో వరుస దొంగతనాలు...

  • పోలీసు అధికారులు నిఘా పెంచాలి.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

అక్టోబర్ 22,

మణుగూరు పట్టణంలో దొంగలు రెచ్చిపోతూ దేవాలయాలే వాళ్ళ లక్ష్యంగా చేసుకొని హుండీలను పగలగొట్టి వాటిలోని డబ్బులను విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు.

మణుగూరు మండల పరిధిలోని సమితి సింగారం గ్రామ పంచాయతీ సమీపంలోని ముత్యాలమ్మ దేవాలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు.

అమ్మవారి దేవాలయంలో దేవత వెండి కండ్లు, వెండి ఆభరణాలు , గుడి పూజ సామాన్లు ఎత్తుకొని వెళ్లడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పని చేయడం లేదని పోలీస్ శాఖ వారు స్పందించి వరుస దొంగతనాల పై నిఘా పెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Updated On 22 Oct 2024 7:25 PM IST
cknews1122

cknews1122

Next Story