ఎవరు పాలనాదక్షకుడు…!?
ఎవరు పాలనా భక్షకుడు…!?
రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఒక విశ్లేషణ
…………………………………..
అందరినీ భయ పెట్టి, స్వేచ్ఛను అణిచిపెట్టి, ప్రశ్నను తొక్కి పెట్టి… సొంత పార్టీ నేతలను సైతం బానిసలుగా కట్టిపెట్టి దేశ్ కీ నేత అని భుజకీర్తులు తగిలించుకుని తిరిగిన కేసీఆర్ కు…
స్వేచ్ఛకు ప్రాణం పోసి, ప్రశ్నించే తత్వానికి జీవం పోసి, ప్రతిపక్షం దుర్మార్గమైన విషం చిమ్ముతున్నా సంయమనంతో ఓపిక పట్టి పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి మధ్య తేడా ఏమిటి?
వీరిద్దరిలో ఎవరు నిజమైన పాలనా దక్షకుడు… ఎవరు పాలనా భక్షకుడు! ఒకళ్లు పదేళ్లు పాలించారు… ఇంకొకరు పది నెలల నుండి పాలిస్తున్నారు.
పాలనా కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఇద్దరి పాలనపై ఇప్పుడే విశ్లేషణ చేయలేం. కానీ, ఒకే అంశంపై ఈ ఇద్దరు నాయకులు తీసుకున్న నిర్ణయం… ఆ నిర్ణయాన్ని అమలు చేసిన తీరు పై విశ్లేషణ చేయడం సముచితంగా ఉంటుంది. ఈ ఇద్దరి పాలనలో ఇప్పటి వరకు కామన్ గా ఉన్న అంశం గ్రూప్ -1 పరీక్షలు, ఉద్యోగ నియామకాలు.
తెలంగాణ వస్తే ఏమొస్తుందిరా…!? ఉద్యమ సమయంలో ఎవరైనా ఈ ప్రశ్న వేస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి అని నిద్రలో లేపి అడిగినా చెప్పే స్థాయిలో యువత ఆశలు పెంచుకున్నారు. రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. పదేళ్లు అప్రతిహతంగా రాజ్యం ఏలాడు. ఉద్యోగాలు రాలేదు.
నిరుద్యోగులు ఆత్మహత్యలు జరిగినా కేసీఆర్ చెలించలేదు. వేయక వేయక ఆయన ముఖ్యమంత్రి అయిన ఎనిమిదేళ్ల తర్వాత 503 పోస్టులతో 2022 లో గ్రూప్ -1 నోటిఫికేషన్ వేశారు. పేపర్ లీక్ తో అది కాస్తా తుస్సు మంది. ఆ తర్వాత మళ్లీ పరీక్ష పెడితే బయో మెట్రిక్ అమలు చేయలేదు…
నిబంధనలు పాటించలేదని కోర్టు ఆ పరీక్షలను రద్దు చేసింది. అంతే సంగతులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయానికి వద్దాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో గ్రూప్ -1 పరీక్షలకు 563 పోస్టులతో నోటిఫికేషన్ వేశారు.
జూన్ 9 ప్రాథమిక పరీక్ష దిగ్విజయంగా, ఒక్కటంటే ఒక్క వివాదం లేకుండా పూర్తి చేశారు. తాజాగా గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. నిన్నటి పరీక్షల నిర్వహణలో ఒక్కటంటే ఒక్క వివాదం లేదు. హైకోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ప్రభుత్వం ఎంత పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకుంటే… ఇది సాధ్యం!
గ్రూప్ -1 విషయంలో కేసీఆర్ చతికిల పడితే… రేవంత్ రెడ్డి సమర్ధంగా ముందుకు వెళుతున్నారు. నిరుద్యోగుల ఆశలు తీర్చుతున్నారు.
గ్రూప్ -1 విషయంలో కేసీఆర్ హయాంలో జరిగిన దానిని… రేవంత్ రెడ్డి హయాంలో జరిగిన దానిని పోల్చి చూసుకుంటే ఎవరు పాలనా భక్షకుడు… ఎవరు పాలనా దక్షకుడో ప్రజలకే అర్థమవుతుంది.
ఎలికచ్చెను సాయిబాబా కాంగ్రెస్ పార్టీ
INTUC నాయకులు