కూకట్ పల్లిలో ఆన్‌లైన్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. 38 మంది మహిళల అరెస్ట్..
హైదరాబాద్ లోని కూకట్ పల్లి మెట్రో వద్ద బహిరంగంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా ఆగడాలను పోలీసులు గుట్టు రట్టు చేశారు. కూకట్ పల్లి సర్కిల్ లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు.కూకట్ పల్లి మెట్రో కింద న్యూసెన్స్ చేస్తున్నట్లు గుర్తించారు.
సుమారు 38 మంది మహిళలు అదుపులో తీసుకున్నారు. మెట్రో స్టేషన్ కింద బహిరంగంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు స్థానిక సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
మెట్రో వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న 38 మంది మహిళలను అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో కూకట్ పల్లి గర్ల్స్ పేరుతో ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసి పెట్టి ముఠా వ్యభిచారం చేస్తున్నట్లు తెలిపారు.
కూకట్పల్లి పోలీసులు ఎస్వోటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో 38 మంది పట్టుకున్నట్లు వెల్లడించారు. నలుగురు ట్రాన్స్ జెండర్స్ తో పాటు ముఠా నిర్వాహకుని అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై కూకట్‌పల్లి గర్ల్స్ ని పోలీసులు బైండోవర్ చేశారు.
బైండోవర్ అంటే.. చట్ట వ్యతిరేక పనులు చేయమని బాండ్ పేపర్ పై వారితో లిఖితపూర్వకంగా హామీ తీసుకుని సొంతపూచీకత్తుపై విడుదల చేస్తారు. దీనినే బైండోవర్ అని పోలీసులు వివరించారు. నలుగురు ట్రాన్స్ జెండర్స్ తో పాటు ముఠా నిర్వాహకునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.