రైతుపై ఓ ఏఎస్సై దౌర్జన్యం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన రైతుపై ఓ ఏఎస్సై దౌర్జన్యం చేశారు.సంబంధించిన వీడియో శనివారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మునుగోడుకు చెందిన కొమ్ము ముత్యాలు కు, పక్క భూమి రైతుతో గెట్ల హద్దుల వివాదం నడుస్తున్నది. ఈ విషయం లో ఇద్దరూ గత నెల 30న గొడవపడ గా, ము త్యాలుపై సదరు రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మునుగోడు ఏఎస్సై కోటిసింగ్‌, ముత్యాలుకు ఫోన్‌ చేయగా …

రైతుపై ఓ ఏఎస్సై దౌర్జన్యం

నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన రైతుపై ఓ ఏఎస్సై దౌర్జన్యం చేశారు.సంబంధించిన వీడియో శనివారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మునుగోడుకు చెందిన కొమ్ము ముత్యాలు కు, పక్క భూమి రైతుతో గెట్ల హద్దుల వివాదం నడుస్తున్నది.

ఈ విషయం లో ఇద్దరూ గత నెల 30న గొడవపడ గా, ము త్యాలుపై సదరు రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మునుగోడు ఏఎస్సై కోటిసింగ్‌, ముత్యాలుకు ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. దాం తో ఆవేశానికి గురైన ఏఎస్సై.. తన ఫోన్‌ ఎందుకు లిఫ్టు చేయలేదని ప్ర శ్నించారు.

పొలం పనుల్లో ఉండి ఫో న్‌ చూడలేదని చెప్పినా వినకుండా ఏఎస్సై తనను కొట్టాడని బాధిత రై తు ఈ నెల 17న ఎస్పీ కార్యాలయం లో ఫిర్యాదు చేశాడు.

ఎస్సై వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. చండూరు సీఐ వెంకటయ్య విచారణ చేసి నివేదిక అందించినట్టు తెలిపారు.

Updated On 27 Oct 2024 4:12 PM IST
cknews1122

cknews1122

Next Story