దళారులతో నిండిన హైవే
వర్షాకాల పంట చేతికి రావడంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా జోరుగా వరి కోతలు మొదలయ్యాయి ఈ తరుణంలో మిర్యాలగూడ ప్రాంతంలో రైస్ మిల్లులు అధికంగా ఉండడంతో నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వారు ధాన్యం లోడులను మిర్యాలగూడ ప్రాంతానికి అధికంగా తరలిస్తుండడంతో కొంతమంది దళారులు రైస్ మిల్లుల యజమానులతో ముందుగానే వారితో ములకత్ అయి కింటా ధాన్యానికి కొంత పర్సంటేజ్ మాట్లాడుకుని వేములపల్లి ఊరు చివర నుండి చెట్టిపాలెం రైస్ మిల్లుల వరకు అద్దంకి- నార్కెట్ పల్లి రహదారి వెంట కాపు కాసుకుని ఉండి అధిక లోడుతో వచ్చే దాన్యం ట్రాక్టర్లకు అకస్మాత్తుగా ఎదురు వెళ్లడంతో యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని కావున స్థానిక పోలీస్ వారు దీనిపై దృష్టి సారించి హైవేపై విచ్చలవిడిగా ధాన్యం లోడులను ఆపి ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగిస్తున్న మధ్య దళారులను నియంత్రించవలసిందిగా పలువురు కోరుతున్నారు