కోదాడ డి.ఎస్.పి మామిళ్ల శ్రీధర్ రెడ్డికి
దక్షత పతకాన్ని ప్రకటించిన కేంద్ర హోంశాఖ
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య అక్టోబర్ 31
జాతీయ సమైక్యత దినోత్సవం (సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి) సందర్బంగా కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ, నేర పరిశోధనలో అత్యున్నతమైన ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా, సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ డి యస్ పి శ్రీ మామిళ్ళ శ్రీధర్ రెడ్డి కి 2024 సంవత్సరానికి కేంద్ర హోమ్ మంత్రి దక్షత పతాకాన్ని ప్రకటించటం శుభ సంతోషమని జిల్లా పోలీసు యంత్రాంగం పలువురు రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
1998 నవంబర్ లో సబ్-ఇన్స్ పెక్టర్ గా ఎంపికైన శ్రీ మామిళ్ల శ్రీధర్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాచకొండ కమిషనెరేట్ మరియు ప్రత్యేక నిఘా విభాగంలో పనిచేసారు.
ప్రతిష్ట్మాకమైన ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షణ దళానికి దేశం తరుపున ఎంపికై 2016-17 లో హైతీ దేశంలో పోలిస్ ఆపరేషన్స్ ప్లానింగ్ అధికారిగా పని చేసారు.
సంచలనాత్మక హాజీపూర్ కేసులో ముగ్గురు మైనర్ బాలికల అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని తన సాంకేతికత నైపుణ్యాన్నీ ఉపయోగించి స్వల్పకాలంలోనే అరెస్ట్ చేయడంలో,అత్యంత కీలక పాత్ర పోషించటం జరిగింది.
నర్సింహులగూడెం ఫ్యాక్షన్ హత్య కేసు, మరో మూడు హత్యలు, అనేక దోపిడీ, దొంగతనాల కేసుల ఛేదన మరియు దర్యాప్తును తనదైన శైలీలో కృషి, పట్టుదలతో చేసి అనేక కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా విధులను నిర్వహిస్తూ, అనేక సందర్భాల్లో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.
26 సంవత్సరాల సుదీర్ఘ సర్వీసులో అనేక కీలక మైన శాంతి భద్రతల విషయాల్లో, సామాజిక విషయాల్లో , పోలీస్ ప్రజా సంబంధాలను పటిష్టం చేయటంలో, అనేక తీవ్రవాద, దోపిడీ, హత్య , మనుషుల అక్రమ రవాణా, అక్రమ ఆయుధాల కేసుల్లో తన ప్రతిభ పాటవాలను గుర్తించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పొలిసు ఉన్నతాధికారులు, గతంలో కూడా పోలీస్ సేవ పతాకాన్ని, తెలంగాణ రాష్ట్ర శౌర్య పతాకాన్ని, ఉత్తమ సేవ పతాకాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పతాకాన్ని ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ బహుకరించటం జరిగింది. అంతేకాకుండా 2015 లో పంజాబ్ లో జరిగిన అఖిల భారత స్థాయి డ్యూటీ మీట్ లో ఫోరెన్సిక్ సైన్స్ విభగంలో రజత పతాకాన్ని సాధించారు.
2017 లో ఐక్య రాజ్య సమితి శాంతి పతాకాన్ని సాధించారు. మరో రెండొందలకు పైగా రివార్డులు/అవార్డులు పొందారు. ఈ సందర్బంగా రాష్ట్ర డీజీపీ శ్రీ జితెందర్ ఐపీఎస్, శాంతి భద్రతల అదనపు డీజీపీ శ్రీ మహేష్ భగవత్, ఐపీఎస్ జోనల్ ఐజీపీ శ్రీ సత్యనారాయణ ఐపీఎస్ సూర్యాపేట జిల్లా యస్ పి శ్రీ సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్ అదనపు యస్ పి నాగేశ్వర్ రావు మరియు ఇతర అధికారులు కోదాడ డి ఎస్ పి శ్రీధర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించటం జరిగింది.