టపాసుల వెలుగులతో మెరిసిన పల్లెలు నియోజకవర్గ వ్యాప్తంగా హ్యాపీ దీపావళి గ్రామ గ్రామాన అంబరాన్నంటిన దీపాల పండుగ వేడుకలు కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య దీపాల పండుగ ప్రతి ఇంటా దీపావళి సంబురాలు సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య అక్టోబర్ 31 చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా, నరకాసురుడిని సత్యభామ వధించిన గెలుపునకు గుర్తుగా ఇలా పలు విధాల జరుపుకునే దివ్వెల వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. లక్ష్మీదేవి పూజ, నోముల నేపథ్యంలో పూల …

టపాసుల వెలుగులతో మెరిసిన పల్లెలు

నియోజకవర్గ వ్యాప్తంగా హ్యాపీ దీపావళి

గ్రామ గ్రామాన అంబరాన్నంటిన దీపాల పండుగ వేడుకలు

కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య దీపాల పండుగ

ప్రతి ఇంటా దీపావళి సంబురాలు

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య అక్టోబర్ 31

చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా, నరకాసురుడిని సత్యభామ వధించిన గెలుపునకు గుర్తుగా ఇలా పలు విధాల జరుపుకునే దివ్వెల వేడుకలు ఘనంగా సాగుతున్నాయి.

లక్ష్మీదేవి పూజ, నోముల నేపథ్యంలో పూల మార్కెట్లు, టపాసుల దుకాణాలు గ్రామాల్లో పట్టణాల్లో కిటకిటలాడాయి. చిన్నాపెద్దా పెద్ద తేడా లేకుండా బాణసంచా పేలుస్తూ ఆనందోత్సహాలతో గడిపారు.విజయానికి ప్రతీకగా, చీకటిని పారదోలి వెలుగులు తెచ్చే పండుగ దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి.

ఇళ్లన్ని దీపపు కాంతులతో ధగధగలాడాయీ పండుగ పూట ప్రత్యేక పూజలు చేసి బంధువులు, స్నేహితులతో కలిసి మిఠాయిలు పంచుకున్నారు. టపాసులు కాలుస్తూ చిన్నాపెద్దా ఆనందోత్సహాలలో మునిగి తేలి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Updated On 1 Nov 2024 9:28 AM IST
cknews1122

cknews1122

Next Story