పేదల ఆకలి తీర్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరమ్మకే దక్కుతుంది మండల పార్టీ అధ్యక్షులు భూక్యా మంజు నాయక్ ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించిన ప్రధాని ఇందిరమ్మ మండల కాంగ్రెస్ నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇందిరమ్మ వర్ధంతి వేడుకలు సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య అక్టోబర్ 31 పేదల ఆకలి తీర్చి ఇండ్లు లేని నిరుపేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చిన ఘనత ప్రధాని …

పేదల ఆకలి తీర్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరమ్మకే దక్కుతుంది

మండల పార్టీ అధ్యక్షులు భూక్యా మంజు నాయక్

ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించిన ప్రధాని ఇందిరమ్మ

మండల కాంగ్రెస్ నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి

నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇందిరమ్మ వర్ధంతి వేడుకలు

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య అక్టోబర్ 31

పేదల ఆకలి తీర్చి ఇండ్లు లేని నిరుపేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చిన ఘనత ప్రధాని ఇందిరా గాంధీ కె దక్కుతుందని మండల పార్టీ అధ్యక్షులు భూక్యా మంజు నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి అన్నారు.

భారతరత్న ఉక్కు మహిళ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధాన కూడలిలో ఉన్న ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహానికిఘనంగాపూలమాలలు వేసి నివాళులు అర్పించి శ్రాద్ధాంజలి ఘటించారు.

అనంతరం వారు మాట్లాడుతూ గరీబీ హటావో నినాదంతో దేశంలోని పేదల ఆకలి తీర్చిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీకేదక్కుతుందని భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికై దేశానికి ఎనలేని సేవలు చేసి దేశవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించి భూమిలేని నిరుపేదలకు భూములు పంచి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా ఇందిరమ్మగా నిలిచిపోయిందని ఆమె సేవలను కొనియాడారు.

ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పి ఎస్ సి ఎస్ డైరెక్టర్లు మాజీ ఎంపిటిసిలు మాజీ జెడ్పిటిసిలు మాజీ ఎంపీపీలు అనుబంధ సంఘాల నాయకులు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు

Updated On 1 Nov 2024 9:34 AM IST
cknews1122

cknews1122

Next Story